Most Expensive Dogs In India: మనిషికి, శునకాలకు స్నేహం ఈనాటిది కాదు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు మనుషుల పట్ల విపరీతమైన ఆదరణ చూపుతాయి. మనుషులు కూడా వాటిపై అంతే ప్రేమ కనబరుస్తారు. పూర్వపు రోజుల్లో యుద్ధాల్లో రాజులు శునకాలను విరివిగా ఉపయోగించేవారు. శత్రువుల మీద దండెత్తడానికి వారి తురుపు ముక్కలుగా ఉపయోగించుకునేవారు. ఈ జాగిలాలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేవారు. నేటికీ కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన జాగిలాలను పోలీసులు వాడుతున్నారు. దానికి డాగ్ స్క్వాడ్ అని పేరు పెడుతున్నారు. క్లిష్టమైన కేసులకు సంబంధించి నిందితులను పట్టుకునే విషయంలో వారు జాగిలాల సహాయం తీసుకుంటున్నారు.
కాలక్రమేణా శునకాల పెంపకంలో అనేక మార్పులు వచ్చాయి. కొత్త కొత్త జాతులు కూడా ఉద్భవించాయి. ఒకప్పుడు శునకాల కోసం పెద్దగా ఖర్చు చేసేవారు కాదు.. పూర్వకాలంలో అయితే వివిధ ప్రాంతాల నుంచి తెప్పించుకునేవారు.. అయితే వీటి కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించినట్టు చరిత్రలో లేదు.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి కాబట్టి కొత్త కొత్త శునక జాతులు తెరపైకి వచ్చాయి. మిగతా దేశాలతో పోలిస్తే శునకాల పెంపకం కొంత తక్కువే అయినప్పటికీ.. మన దగ్గర ఉన్న అతి ఖరీదైన శునకాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టిబెటన్ మాస్టిఫ్
దీని పేరులోనే ఉంది ఇది టిబెటన్ జాతికి చెందింది అని.. హిమాలయ పర్వత ప్రాంతాలకు చెందిన ఈ శునకం చాలా తెలివైనది. దట్టమైన రోమాలతో, చురకత్తిలాంటి చూపులను కలిగి ఉంటుంది.. ఎలాంటి ప్రతికూల వాతావరణన్నయినా తట్టుకొని ఉండగలుగుతుంది. దీని ఖరీదు రెండు నుంచి ఐదు లక్షలు పలుకుతోంది.
రెడ్ నోస్ ఫిట్ బుల్ టెరియర్
చూసేందుకు ఇది హచ్ డాగ్ లా ఉంటుంది. దీని శరీరం గాఢమైన ఎరుపు రంగులో ఉంటుంది. చెవులు చిన్నగా, తల పెద్దగా ఉంటుంది. కళ్ళు లోపలికి అతుక్కుపోయినట్టు ఉండటం దీని ప్రత్యేక ఆకర్షణ. పెద్దగా అరవదు.. పొట్టిగా ఉంటుంది. దీని ధర 75 వేల నుంచి 1.50 లక్షల వరకు ఉంటుంది.
బోయర్ బోయల్
ఇది దక్షిణాఫ్రికా మూలాలు కలిగిన శునకం. చాలా తెలివైనది. చురకత్తిలాంటి చూపు దీని సొంతం. దేన్నైనా వేగంగా పసిగట్టగలదు. అంతే వేగంగా స్పందించగలదు. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే అరిచేస్తుంది. దీని ధర 1.25 లక్షల నుంచి 2.25 లక్షల దాకా ఉంటుంది.
అలాస్కాన్ మాలా మ్యూట్
ఇది చాలా శక్తివంతమైనది. యజమానిమీద అచంచలమైన విశ్వాసాన్ని చూపుతుంది. వేగానికి చిరునామాగా ఉంటుంది. ఏమాత్రం శత్రువు కదలికలు కనిపించినా రెండో మాటకు తావు లేకుండానే దాడి చేస్తుంది. ఆహార మాత్రం విపరీతంగా లాగిస్తుంది. దీని ధర 2 నుంచి 3.5 లక్షలు ఉంటుంది.
అకీతా
ఇది జపాన్ మూలలు కలిగి ఉన్న రకం. దీనిని వాచ్ డాగ్ అని పిలుస్తారు. దీని రూపు నక్కను పోలి ఉంటుంది.. ఇది నిరంతరం కనిపెట్టుకొని ఉంటుంది.. మిగతా జాతులతో పోలిస్తే ఇది చాలా వైవిధ్యాన్ని చూపిస్తుంది. దీని అరుపు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. దీని ధర 1.5 లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఉంటుంది.