Mona Lisa: సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో చెప్పలేం. తమకున్న అసాధారణ లక్షణాలు, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా ఒక పెద్ద ఫ్లాట్ ఫారం. బెగ్గర్స్ సైతం స్టార్స్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుంభమేళలో పూసలు అమ్మే ఒక అమ్మాయి భక్తులను ఆకర్షించింది. ఆమె ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో షేర్ చేశారు. తేనెకళ్ళతో విభిన్నంగా ఉన్న ఆమె రూపం ఆకర్షించింది. యూట్యూబ్ చానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాయి. ఏకంగా అది నేషనల్ మీడియా న్యూస్ అయ్యే వరకు వెళ్ళింది.
Also Read: సల్మాన్ టైం బ్యాడ్ .. మళ్ళీ దొరికిపోయిన కండలవీరుడు! మేటర్ ఏంటంటే?
కుంభమేళకు వెళ్ళిన వ్యక్తులు ఆమెను కలిసేందుకు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. బాలీవుడ్ దర్శకుడు ఒకరు ఆమె గ్రామాన్ని సందర్శించి, ఇంటికి వెళ్లి సినిమా ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం మోనాలిసా ఒక చిత్రం చేస్తుంది. అదే సమయంలో ఆమె సెలెబ్రిటి హోదాలో పర్యటనలు చేస్తుంది. తాజాగా మోనాలిసా నేపాల్ దేశం వెళ్ళింది. అక్కడ జరుగుతున్న మహాశివరాత్రి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక మీద మోనాలిసా డాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
మోనాలిసా అభిమానులు సదరు డాన్స్ వీడియో అద్బుతంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మోనాలిసా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే.. టైటిల్ ది డైరీ ఆఫ్ మణిపూర్ అని సమాచారం. దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసా ఒక ఆర్మీ అధికారి కూతురు పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి లో మొదలైంది. దర్శకుడు సనోజ్ మిశ్రా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆమెకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు వినికిడి.
ది డైరీ ఆఫ్ మణిపూర్ మూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో మోనాలిసాకు బ్రేక్ వచ్చినట్లే. అయితే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చుకున్న చాలా మంది అనంతరం కనుమరుగు అయ్యారు. అనంతరం జనాలు వాళ్ళను పట్టించుకోలేదు. రాను మొండల్ అనే ఒక బెగ్గర్ సింగింగ్ టాలెంట్ తో అప్పట్లో దేశాన్ని ఊపేసింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియదు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ అధికారికంగా వాయిదా పడినట్టే..ఖరారు చేసిన నిర్మాత..మరి విడుదల అయ్యేది ఎప్పుడు?