
Balakrishna: స్టేట్ అయినా.. సెంటర్ అయినా..? పొజీషనైనా.. అపోజిషనైనా…? అది ఆయన దిగనంత వరకే..! వన్స్ హి స్టెప్ ఇన్… నందమూరి బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగు ఇది. ఇటువంటి డైలాగులు చెప్పాలంటే బాలక్రిష్ణ తరువాతే ఎవరైనా.. అందుకే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతెందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం బాలయ్య అభిమానే. ఆయన అభిమాన సంఘాల్లో వర్కు చేసిన వారే. అందుకే బాలయ్య అంటే జగన్ కూడా ఒక రకమైన అభిమానం చాటుకుంటారు. అటు బాలయ్య సైతం జగన్ విషయంలో పొడిపొడిగానే మాట్లాడతారు. కేవలం సైద్ధాంతికంగానే విమర్శిస్తారు. వ్యక్తిగత విమర్శలకు పోరు. అటువంటి బాలయ్యే ఇప్పుడు తన అభిమాని అయిన జగన్ పై ఫైర్ అయ్యారు. ఆయన విధానాలను పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఏపీ ప్రజలకు కొన్నిరకాల హెచ్చరికలు పంపారు.
లోకేష్ కలిసి అడుగులేసి..
నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. 63వ రోజుకు చేరుకుంది. శుక్రవారం పాదయాత్రకు బాలక్రిష్ణ సంఘీభావం తెలిపారు. అల్లుడు లోకేష్ తో కలిసి అడుగులు వేశారు. కొంతసేపు పాదయాత్రలో పాల్లొన్నారు. అంతకు ముందు మీడియా సమావేశంలో బాలక్రిష్ణ మాట్లాడుతూ వైసీపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు జగన్‌కు ఓటు వేయద్దని కోరారు. సంక్షేమ పథకాల అమలుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకున్న చందంగా, ఏపీలో కూడా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వాడుకోవాలని కోరారు. కులమనో, మరొక కారణమో చూపి వైసీపీకి అండగా నిలబడకూడదని ఆయన కోరారు. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడేవాళ్లన్నారు. ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.

బాలయ్య తొలి రియాక్షన్…
లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా నడుస్తుండడంపై బాలక్రిష్ణ ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్రకు మద్దతుగా జనం తండోపతండాలుగా రోడ్డు మీదకి వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్‌పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వుందని అన్నారు. చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి సేవ చేసేందుకు వస్తామని వారే అడుగుతున్నారని బాలక్రిష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడూ సినిమాలు, లేకుంటే హిందూపురం రాజకీయాల్లో బిజీగా ఉండే బాలక్రిష్ణ తన అభిమాని జగన్ పై ఇంతలా విరుచుకుపడడం ఇదే ఫస్ట్ టైమ్. అటు అసెంబ్లీకి హాజరైనా పెద్దగా మాట్లాడే వారు కాదు. అటువంటిది బాలక్రిష్ణ జగన్ తో పాటు వైసీపీ సర్కారు తీరుపై విరుచుకుపడడం, ప్రజలకు పిలుపునివ్వడం విశేషం. దీనిపై వైసీపీ నేతలు ఏ రేంజ్ లో స్పందిస్తారో చూడాలి మరీ.