Mizoram: ఆ రాష్ట్ర ప్రజలు నిత్యం ఆనందంగా ఉండడానికి కారణాలేంటి?

Mizoram: చిన్న రాష్ట్రమే అయినా చాలా తెలివి రాష్ట్రమట. అక్కడి ప్రజలు పాజిటివ్ థింకింగ్ తో ఉంటారట. నిత్యం ఆనందంగా జీవిస్తారట. అందుకే ఆ రాష్ట్రం దేశంలోనే సంతోకరమైన రాష్ట్రంగా ఉందట. అయితే ఇదేదో ఆషామాషిగా చెబుతున్న మాట కాదు. గురుగ్రామ్ లోని మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన సర్వేలో తేలిందట. కుటుంబం, బంధాలు, పని ప్రదేశాలు, సామాజిక అంశాలు, ధాతృత్వం, కులమతాలు, కరోనా తర్వాత జీవితం అనే 6 అంశాలను ఆధారంగా […]

Written By: Dharma, Updated On : April 20, 2023 10:52 am
Follow us on

Mizoram

Mizoram: చిన్న రాష్ట్రమే అయినా చాలా తెలివి రాష్ట్రమట. అక్కడి ప్రజలు పాజిటివ్ థింకింగ్ తో ఉంటారట. నిత్యం ఆనందంగా జీవిస్తారట. అందుకే ఆ రాష్ట్రం దేశంలోనే సంతోకరమైన రాష్ట్రంగా ఉందట. అయితే ఇదేదో ఆషామాషిగా చెబుతున్న మాట కాదు. గురుగ్రామ్ లోని మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన సర్వేలో తేలిందట. కుటుంబం, బంధాలు, పని ప్రదేశాలు, సామాజిక అంశాలు, ధాతృత్వం, కులమతాలు, కరోనా తర్వాత జీవితం అనే 6 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఈ అంశాలన్నింటిలో చిన్న రాష్ట్రమైన మిజోరం బెస్ట్ గా నిలిచిందట. చాలా రోజులు పాటు సాగిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

16 ఏళ్లకే ఆర్జన..
మిజోరంలో అసలు లింగభేదం అన్నది కనిపించదట. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచే కష్టపడతారట. 16 సంవత్సరాలకే పిల్లలు పనిలోకి వెళతారట. ప్రతీఒక్కరూ సంపాదనపై దృష్టిపెడతారట. ఫైనాన్సియల్ ఇండిపెండెంట్ పొందుతున్నారు. పాఠశాలల్లో అసలు ఒత్తిడి విద్య ఉండదట. తరచూ పేరెంట్స్ మీటింగ్ లు నిర్వహిస్తుంటారట. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో సన్నిహితంగా మెలుగుతారట. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైనప్పటికీ, పిల్లల్ని పెంచడంలో తండ్రి లేదా తల్లి పూర్తి పరిణతి చూపిస్తున్నారట. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం కులం-మతం. ఈ రెండు విషయాల్ని మిజోరం ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారట. ఎదుటి వ్యక్తిని ఈ కోణంలో చూసే ప్రజలు మిజోరంలోనే తక్కువగా ఉన్నారంట.

Mizoram

వ్యాధులు దరిచేరవు..
ఇంకో విషయం ఏమిటంటే మిజోరంలో వ్యాధులు, రోగాలు తక్కువేనట. దీనికి అక్కడి ప్రజలు సంతోషకరమైన జీవితం అవలంభిస్తుండడమే కారణమట. దేశ వ్యాప్తంగా కొవిడ్ విపరీతమైన ప్రభావం చూపినా మిజోరంలో మాత్రం తక్కువేనట. కరోనా దుష్ప్రభావాల నుంచి త్వరగా బయటపడిన రాష్ట్రాల్లో మిజోరం ముందుందట. ఈ కారణాలన్నింటి వల్ల మిజోరం ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని సదరు సర్వేలో తేలింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.