https://oktelugu.com/

ప్రియుడితో పెళ్లి చేస్తారా? చావాలా.. యువతి హల్ చల్

నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అని ఓ మైనర్.. నిండా 18 ఏళ్లు కూడా నిండని బాలిక ప్రియుడితో పెళ్లి చేయాలని నానా హంగామా చేసింది. అంత చిన్న వయసులో ఎందుకు అంతలా తపనపడుతుందో తెలియక తల్లిదండ్రులు బెదిరించడంతో చస్తానంటూ ఓ హోర్డింగ్ ఎక్కి రచ్చ రచ్చ చేసింది. ఈ కిష్కింధ కాండ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 06:17 PM IST
    Follow us on

    నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అని ఓ మైనర్.. నిండా 18 ఏళ్లు కూడా నిండని బాలిక ప్రియుడితో పెళ్లి చేయాలని నానా హంగామా చేసింది. అంత చిన్న వయసులో ఎందుకు అంతలా తపనపడుతుందో తెలియక తల్లిదండ్రులు బెదిరించడంతో చస్తానంటూ ఓ హోర్డింగ్ ఎక్కి రచ్చ రచ్చ చేసింది. ఈ కిష్కింధ కాండ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో ఆదివారం ఓ మైనర్ బాలిక చేసిన హంగామా మీడియాలోకి ఎక్కింది.. ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్ పైకి ఎక్కి కూర్చొని కంగారుపెట్టింది. ఇండోర్ లోని పర్ దేశీ పురాకు చెందిన ఓ మైనర్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే ఇందుకు తల్లి ససేమిరా అన్నది. దీంతో ఆగ్రహించిన ఆ బాలిక అక్కడికి దగ్గరలోని హోర్డింగ్ పైకి ఎక్కింది. నచ్చినవాడితో పెళ్లి చేయకుంటే కిందకు దూకి చస్తానంటూ బెదిరింపులకు దిగింది.

    తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బతిమిలాడినా పట్టువీడలేదు. మొబైల్ ఫోన్ ను చూసుకుంటూ పైనే కూర్చొని హంగామా సృష్టించింది.

    Also Read: దీపావళి పండుగ జరుపుకునే వారికి అలర్ట్.. వాటిపై నిషేధం..?

    చివరకు ఆ బాలికను ప్రేమిస్తున్న యువకుడు వచ్చి నచ్చజెప్పి కిందకు దించాడు. బాలిక కిందకు దిగడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఆవేశాలకు పోయి యువతకు తమకు దక్కాల్సిన దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు.