Mike Tyson: కొన్నిసార్లు అభిమానులు చేసే చేష్టలు సెలబ్రిటీలకు కోపాన్ని తెచ్చిపెడతాయి. అభిమానులు ఫన్ కోసమే చేసినా స్టార్లను అవి ఇబ్బంది పెడతాయి. తాజాగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో అతడు తాను ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఈనెల 20న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్ టైసన్ జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. ఈ విమానంలో మైక్ టైసన్ వెనుక సీటులో కూర్చున్న యువకుడు పెద్ద వాగుడుకాయ. దీంతో అతడు నాన్‌స్టాప్‌గా మాటలు చెప్తూనే ఉన్నాడు. తనకు కొంచెం అలసటగా ఉందని.. తనతో మాట్లాడొద్దంటూ సదరు యువకుడికి మైక్ టైసన్ స్పష్టంగా చెప్పాడు.
Also Read: Vasireddy Padma: వియవాడ గ్యాంగ్ రేప్ పరామర్శకు వచ్చిన వాసిరెడ్డి పద్మకు సాకిచ్చిన మహిళలు
కానీ ఆ యువకుడు వినిపించుకోకుండా నస పెడుతూనే ఉన్నాడు. పనిలో పనిగా టైసన్‌పై ఫన్నీ కామెంట్లు కూడా చేశాడు. టైసన్‌ను ఉద్దేశించి బ్యాడెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ప్లానెట్ అని మాట్లాడాడు. మొదట్లో ఆ యువకుడి కామెంట్లను టైసన్ పట్టించుకోలేదు. కానీ యువకుడి వాగుడు ఎక్కువ కావడంతో టైసన్ సహించలేకపోయాడు.
దయచేసి న్యూసెన్స్ చేయవద్దని ఆ యువకుడిని మైక్ టైసన్ కోరాడు. అయినా యువకుడు తన ధోరణి మార్చుకోలేదు. దీంతో టైసన్‌కు కోపం కట్టలు తెచ్చుకోవడంతో ఆ యువకుడి వద్దకు వెళ్లి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో సదరు యువకుడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
Also Read:Alia Bhatt: కత్రినా ఇంట్లో ఆలియా భట్ కాపురం !
#miketyson seemed to lose his cool on a #plane on Wednesday night … repeatedly #punching a man in the face after the guy had apparently annoyed him. Video Footage: TMZ pic.twitter.com/xiy9zgdrhd
— (@NoPlugMedia) April 21, 2022
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Mike tyson punches passenger on us plane video viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com