https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Srisatya : అర్ధరాత్రి ఎలిమినేషన్… ఇంకా ఇంటికి చేరని శ్రీసత్య, కంగారు పడుతున్న పేరెంట్స్

Bigg Boss 6 Telugu Srisatya : మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊహించని పరిణామం. దీని గురించి ప్రేక్షకులకు తెలుసు కానీ… కంటెస్టెంట్స్ కి తెలియదు. లాస్ట్ వీకెండ్ నాగార్జున ఈ సంగతి ఆడియన్స్ తో పంచుకున్నాడే కానీ ఇంటి సభ్యులకు చెప్పలేదు. ఆరుగురు సభ్యులు ఫైనల్ కి వెళతారనే అపోహలో వారు ఉన్నారు. అయితే అర్ధరాత్రి నిద్రలేపి ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు. ఘాడ నిద్రలో ఉన్న కంటెస్టెంట్స్ ని కుక్క అరుపులు, సైరన్ చప్పుళ్లతో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2022 / 08:24 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Srisatya : మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊహించని పరిణామం. దీని గురించి ప్రేక్షకులకు తెలుసు కానీ… కంటెస్టెంట్స్ కి తెలియదు. లాస్ట్ వీకెండ్ నాగార్జున ఈ సంగతి ఆడియన్స్ తో పంచుకున్నాడే కానీ ఇంటి సభ్యులకు చెప్పలేదు. ఆరుగురు సభ్యులు ఫైనల్ కి వెళతారనే అపోహలో వారు ఉన్నారు. అయితే అర్ధరాత్రి నిద్రలేపి ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు. ఘాడ నిద్రలో ఉన్న కంటెస్టెంట్స్ ని కుక్క అరుపులు, సైరన్ చప్పుళ్లతో బిగ్ బాస్ నిద్రాభంగం చేశాడు. అర్థరాత్రి ఈ మద్దెల దరువేంటని కంటెస్టెంట్స్ కంగారు పడ్డారు. అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి అసలు విషయం చెప్పడంతో షాక్ అయ్యారు.

     

     

    ఇంటి సభ్యులు ఎవరు బయటకు వెళ్లాలని కోరుకుంటున్నారో ఆ సభ్యుడు పేరు చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. అత్యధికంగా ముగ్గురు కీర్తి పేరు చెప్పారు. అయితే కంటెస్టెంట్స్ అభిప్రాయం ఆధారంగా కాకుండా ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. ఆరుగురు సభ్యుల్లో తక్కువ ఓట్లు వచ్చిన శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. చేసేది లేక శ్రీసత్య బట్టలు సర్దుకుంది.

    శ్రీసత్య ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న రేవంత్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. ఫైనల్ కి సింపతీ గైన్ చేసే ప్రయత్నం చేశాడు. కన్నీరు పెట్టుకొని చాలా ఫీలైపోయాడు. రేవంత్ ఓవర్ యాక్షన్ ని పక్కనే ఉన్న శ్రీహాన్ కూడా చూసి ఎంజాయ్ చేశాడు. నిజానికి ఇక్కడ బాధపడాల్సింది శ్రీహాన్. ఆమెతో అఫెక్షన్ పెంచుకుంది శ్రీహాన్ కాబట్టి. ఇక శ్రీహాన్ ఎలిమినేషన్ చాలా మంది బిగ్ బాస్ ప్రేక్షకుల కళ్ళలో ఆనందం నింపింది. ఫైనల్ గా కన్నింగ్, స్నేక్ ఎలిమినేట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ వెల్లువెత్తాయి. ఈ సీజన్లో శ్రీసత్య విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది.

    ఇదిలా ఉంటే ఎలిమినేటైన శ్రీసత్య ఇంటికి చేరలేదట. ఆమె ఎలిమినేషన్ టీవీలో చూసిన పేరెంట్స్ ఇంకా ఇంటికి చేరలేదేంటని కంగారు పడ్డారట. ఫినాలే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మొత్తం పాల్గొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శ్రీసత్యను బిగ్ బాస్ సెట్ లోనే ఉంచారట. బిగ్ బాస్ షో విషయాలు లీక్ చేయకుండా ఆమెకు ఫోన్ కూడా ఇవ్వలేదట. ఈ క్రమంలో శ్రీసత్య పేరెంట్స్ ఆందోళన గురయ్యారని తెలుస్తుంది. తర్వాత విషయం తెలిసి వారు సద్దుమణిగారట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రేపు జరగబోయే ఫినాలేలో టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠకు తెరపడనుంది.