Salt And sugar: ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన టాక్సిక్స్ లింక్

పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ నిర్వహించిన అధ్యయనంలో ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ.. అధ్యయనంలో భాగంగా 10 రకాల ఉప్పులు, 5 రకాల చక్కెరలను సేకరించింది.

Written By: Neelambaram, Updated On : ఆగస్ట్ 14, 2024 9:37 ఉద.

Salt And sugar

Follow us on

Salt And sugar: సాధారణంగా అందరి వంటింట్లో ఉప్పు, చక్కెర అనేది కామన్‌గా ఉంటుంది. చక్కెర అయితే టీ, కాఫీ ఎక్కువగా తాగే వాళ్ల ఇంట్లో ఉంటుంది. ఈ అలవాటు లేనివాళ్ల దగ్గర చక్కెర ఉండటం అరుదు. ఆరోగ్య రీత్యా కొందరు ఈమధ్య ఎక్కువగా బెల్లం వాడుతున్నారు. టీ, కాఫీ, స్వీట్స్ చేసేటప్పుడు బెల్లం వాడుతున్నారు. బెల్లంతో చేసిన వంటకాల వల్ల ఆరోగ్యంగా ఉంటారని చక్కెరను తక్కువగా వాడుతున్నారు. పంచదార లేని ఇళ్లు ఉంటుందో ఏమో కానీ ఉప్పు లేని ఇళ్లు అయితే ఉండదు. వంటింట్లో ఉప్పు అనేది తప్పనిసరి. అది లేకపోతే వంటల్లో రుచి ఉండదు. ఉప్పు లేకపోతే అసలు వంటలు కూడా చేయాల్సిన అవసరం లేదేమో. అయితే మనం రోజూ వాడే ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. నిత్యం వాడే ఉప్పు, చక్కెర‌లో ఇవి ఉండటం అందరిని షాక్‌కు గురిచేసింది. మనిషి జీవితంలో ఫుడ్ చాలా ఇంపార్ట్‌టెంట్. అలాంటిది అన్ని వంటల్లో ఉపయోగించే ఉప్పు, రిఫ్రెష్ కోసం రోజూ తాగే టీ, కాఫీ, జ్యూస్‌లో వాడే పంచదారలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉండటంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ నిర్వహించిన అధ్యయనంలో ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ.. అధ్యయనంలో భాగంగా 10 రకాల ఉప్పులు, 5 రకాల చక్కెరలను సేకరించింది. రాక్ సాల్ట్, సీ సాల్ట్, టేబుల్ సాల్ట్ ఇలా అన్నింట్లో సన్నని దారాలు, గుండ్రంగా, థిన్ షీట్స్‌లో ఉన్న మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటి పరిమాణం 0.1 మిమీ నుంచి 0.5 మిమీ వరకు ఉంటుందని అధ్యయనం తెలిపింది. అయితే ఈక్రమంలో చూస్తే కేజీ ఉప్పులో దాదాపుగా 6.71 నుంచి 89.15 గ్రాముల వరకు మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు టక్సిక్స్ సంస్థ గుర్తించింది. ఆర్గానిక్ రాక్ సాల్ట్‌లో కిలోగ్రాముకు 6.70 ముక్కలు అత్యల్పంగా, అయోడైజ్డ్ సాల్ట్‌లో అత్యధికంగా కిలోగ్రాముకు 89.15 ముక్కలు ఉన్నట్లు తేలింది.

ఉప్పు, చక్కెరలో ఉండే మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు. పర్యావరణం కూడా కలుషితమవుతుంది. చిన్ని ప్లాస్టిక్‌ మనం తినే ఫుడ్ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటివల్ల ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి. అలాగే తల్లిపాలు, పుట్టబోయే పిల్లలతో పాటు మానవ అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుందట. అలాగే క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అయితే ఏ ఏ బ్రాండ్ల ఉప్పులో ఎన్ని గ్రాములు మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించలేదు. ఒక్కో బ్రాండ్ ఉప్పు పరిమాణం ఒక్కోలా ఉంటుంది. అయితే సగటున ప్రతి భారతీయుడు రోజూ 10.98 గ్రాముల ఉప్పు, 10 స్పూన్ల చక్కెరను వినియోగిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది.