Michael Trailer Review: ఆడియన్స్ టేస్ట్ మారింది. క్రైమ్ థ్రిల్లర్స్ సంచలనాలు చేస్తున్నాయి. గత ఏడాది విడుదలైన విక్రమ్ వందల కోట్ల వసూళ్లు సాధించింది. సిల్వర్ స్క్రీన్ మీద అలాగే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో దుమ్మురేపుతున్నాయి. అందుకే మేకర్స్ ఈ జోనర్ పై దృష్టి పెట్టారు. ఒక భారీ హిట్ కోసం ట్రై చేస్తున్న సందీప్ కిషన్ మైఖేల్ అంటూ క్రైమ్ డ్రామా ఎంచుకున్నారు. విడుదలకు సిద్దమైన మైఖేల్ ట్రైలర్ విడుదల చేశారు. నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ విడుదలైంది. రెండు నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం హైప్ ఇచ్చింది.

క్రైమ్ డ్రామాకు ఇంటెన్స్ లవ్ ఎమోషన్ మిక్స్ చేసి మైఖేల్ మూవీని దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించారు. ఒక అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నావా? అని గౌతమ్ మీనన్ చెప్పగా… మైఖేల్ క్యారెక్టర్ చేసిన సందీప్ కిషన్ ‘అవును సార్ అమ్మాయి కోసమే ఇదంతా చేశా. అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ ఒక మనిషి బ్రతకాలి’ అని చెప్పడం ఆసక్తి రేపుతోంది.
ఒక క్రైమ్ వరల్డ్… అందులో పవర్ ఫుల్ రోల్స్. మైఖేల్ ట్రైలర్ చాలా కొత్తగా అనిపించింది. దర్శకుడు ఏదో గట్టిగా చెప్పాలని ఫిక్స్ అయ్యాడనిపిస్తుంది. కథలో అడుగడునా రక్తపాతం కనిపిస్తుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి, అనసూయ, గౌతమ్ మీనన్ వంటి టాలెంట్ యాక్టర్స్ భాగమయ్యారు. కీలక పాత్రలు గెటప్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. నటుడు వరుణ్ సందేశ్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి సడన్ గా గ్యాంగ్ స్టర్ రోల్ కి టర్న్ అయ్యాడు.

మొత్తంగా మైఖేల్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. బ్రేక్ ఇచ్చే మూవీ కోసం ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్న సందీప్ కి భారీ హిట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఫిబ్రవరి 3న మైఖేల్ విడుదల చేస్తున్నారు. హీరోయిన్ గా మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. ఆమె పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. శ్యామ్ సి ఎస్ మ్యూజిక్ అందించారు. భరత్ చౌదరి, రామ మోహన రావు పుస్కూర్ నిర్మిస్తున్నారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.