https://oktelugu.com/

Dasara movie Memes : దసరా మూవీపై అదిరిపోయే మీమ్స్… బ్రహ్మానందం వర్షన్ కేక భయ్యా, నవ్వలేక పొట్ట పగలాల్సిందే!

  Dasara movie Memes : సోషల్ మీడియాలో మీమ్ రాయుళ్లదే హవా. విషయం ఏదైనా తమదైన శైలిలో ఫన్, ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తారు. నాని-కీర్తి సురేష్ ల లేటెస్ట్ మూవీ దసరా మీమర్స్ కి గనిలా దొరికింది. ట్రైలర్, నాని-కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్స్, డైలాగ్స్,సాంగ్స్ మీద లెక్కకు మించిన మీమ్స్ పుట్టుకొచ్చాయి. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పిచ్చ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. సోషల్ మీడియాలో అత్యధికంగా ఆదరణ పొందిన ఈ మీమ్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2023 / 07:43 PM IST
    Follow us on

     

    Dasara movie Memes : సోషల్ మీడియాలో మీమ్ రాయుళ్లదే హవా. విషయం ఏదైనా తమదైన శైలిలో ఫన్, ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తారు. నాని-కీర్తి సురేష్ ల లేటెస్ట్ మూవీ దసరా మీమర్స్ కి గనిలా దొరికింది. ట్రైలర్, నాని-కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్స్, డైలాగ్స్,సాంగ్స్ మీద లెక్కకు మించిన మీమ్స్ పుట్టుకొచ్చాయి. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పిచ్చ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. సోషల్ మీడియాలో అత్యధికంగా ఆదరణ పొందిన ఈ మీమ్స్ మీరు కూడా చూసేయండి.

    దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించారు. విలేజ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు సమాచారం. నాని ఈ మూవీలో ధరణి అనే బొగ్గు గని కార్మికుడు రోల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి వెన్నెల పాత్రలో అలరించనున్నారు. నాని, కీర్తి సురేష్ లుక్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక సంతోష్ నారాయణ్ మూవీ హైలెట్ గా నిలిచింది. దసరా చిత్రం మీద భారీ హైప్ ఏర్పడింది.

    మార్చి 30న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ విజయాన్ని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశంలోని పలు నగరాల్లో తిరిగి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ముఖ్యంగా హిందీలో సక్సెస్ చేయాలని ఆయన ఆలోచన. అందుకే ముంబైలో నాని చక్కర్లు కొట్టారు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

    సుధాకర్ చెరుకూరి దసరా చిత్ర నిర్మాతగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో దసరా ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. యూఎస్ లో మొదటిగా షో పడుతుంది. ఇక నానికి ఈ చిత్ర విజయం చాలా అవసరం. ఆయన భారీ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాగే దసరా హిట్ అయితే ఆయన రేంజ్ మారిపోతుంది. పాన్ ఇండియా హీరోగా అవతరించవచ్చు. మార్కెట్, రెమ్యూనరేషన్ పెరుగుతాయి. మరి నాని కష్టానికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఆయన మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.