Chiranjeevi – Upendra : ఉపేంద్ర దర్శకత్వంలో మిస్ అయిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం అదేనా!

Chiranjeevi – Upendra : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విభిన్నమైన అభిరుచి గల నటుడు/దర్శకుడు ఎవరైనా ఉన్నాడా అంటే అది ఉపేంద్ర అని చెప్పొచ్చు.ఆరోజుల్లో ఈయన తీసిన సినిమాలన్నీ ఒక్క ప్రభంజనం.తాను చెప్పాలనుకున్న ఏ అంశాన్ని అయినా చాలా బోల్డ్ గా చెప్పే విధమైన ఉపేంద్ర ఆలోచనలు చాలా క్రేజీ గా ఉంటాయి.అసిస్టెంట్ డైరెక్టర్ గా కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉపేంద్ర ఆ తర్వాత దర్శకుడిగా మారి అక్కడి స్టార్ హీరోలతో వరుసగా […]

Written By: NARESH, Updated On : February 6, 2023 10:25 pm
Follow us on

Chiranjeevi – Upendra : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విభిన్నమైన అభిరుచి గల నటుడు/దర్శకుడు ఎవరైనా ఉన్నాడా అంటే అది ఉపేంద్ర అని చెప్పొచ్చు.ఆరోజుల్లో ఈయన తీసిన సినిమాలన్నీ ఒక్క ప్రభంజనం.తాను చెప్పాలనుకున్న ఏ అంశాన్ని అయినా చాలా బోల్డ్ గా చెప్పే విధమైన ఉపేంద్ర ఆలోచనలు చాలా క్రేజీ గా ఉంటాయి.అసిస్టెంట్ డైరెక్టర్ గా కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉపేంద్ర ఆ తర్వాత దర్శకుడిగా మారి అక్కడి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసాడు.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో ఆయన చేసిన ‘ఓం’ అనే చిత్రం సంచలన విజయం సాధించింది.అదే సినిమాని తెలుగులో రాజశేఖర్ తో ‘ఓంకారం’ అని తీసాడు, కానీ అక్కడ హిట్ అయ్యినట్టు ఇక్కడ ఈ సినిమా విజయం సాధించలేదు.అయితే ఆయన హీరో గా నటించిన ‘రా’, ‘ఉపేంద్ర’ మరియు ‘కన్యాదానం’ వంటి సినిమాలు తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచాయి.

కన్నడ సినీ పరిశ్రమ అంటే రాజ్ కుమార్ గారు ఎలా అయితే మనకి గుర్తుకు వస్తాడో,ఆయన తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమకి ముఖంగా మారిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఉపేంద్ర అనే చెప్పొచ్చు,ఇప్పుడు రీసెంట్ గా ఆయన పాన్ ఇండియా లెవెల్ లో ‘కబ్జా’ అనే చిత్రం చేసాడు..భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మార్చి 17 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు,అయితే ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ని ఇటీవలే పెద్ద ఈవెంట్ ద్వారా తెలుగు లో కూడా లాంచ్ చేసారు.

ఈ ఈవెంట్ లో గతం లో మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని,ఒకటిన్నర సంవత్సరం వరకు ఆ సినిమాకోసం స్క్రిప్ట్ వర్క్ చేసానని, రాఘవేంద్ర రావు గారి లాంటి దర్శకుడితో కూడా ఆ కథ గురించి చర్చలు జరిపామని, కానీ నా బ్యాడ్ లక్ వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదంటూ ఈ సందర్భంగా ఉపేంద్ర తెలిపాడు, ఆ చిత్రం తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘ఓం ‘ తరహా కథ అట, నిజంగా మెగాస్టార్ అలాంటి సబ్జెక్టు తో సినిమా తీసి ఉంటే సౌత్ ఇండియా షేక్ అయ్యేది.