Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు..వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ప్రభంజనం సృష్టిస్తున్న వీరయ్య నిన్న రిపబ్లిక్ డే అవ్వడం తో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేసాడు..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం నిన్న రెండు కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

దీనితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి రీచ్ అయ్యింది..మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం 14 వ రోజున #RRR కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..14 వ రోజు #RRR చిత్రానికి కోటి 89 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..నిన్న మొన్నటి వరకు ఆల్ టైం టాప్ 3 చిత్రం గా నిలిచింది #RRR.
ఇప్పుడు ఆ రికార్డుని ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం చాలా తేలికగా దాటేయడం ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు..#RRR రికార్డుని అయితే దాటింది కానీ అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం లో ‘ రికార్డుని మాత్రం దాటలేకపోయింది..14 వ రోజు ఆ చిత్రానికి సుమారు గా రెండు కోట్ల 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

‘వాల్తేరు వీరయ్య’ దగ్గరికి అయితే వెళ్ళింది కానీ బ్రేక్ చెయ్యలేకపోయింది..ఇక టాప్ 1 స్థానం లో భారీ మార్జిన్ తో ‘బాహుబలి 2 ‘ మూడు కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ తో నిలిచింది..ఇదంతా ఒక్క ఎత్తు అయితే ఎప్పుడో 7 ఏళ్ళ క్రితం విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రం ఇప్పటికీ టాప్ 5 లో ఉండడం విశేషం..14 వ రోజు ఈ చిత్రానికి దాదాపుగా కోటి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.