Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. స్వయంకృషి తో మెగాస్టార్ గా ఆయన ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయం.. ప్రతీ రంగానికి చెందిన వాళ్ళు చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా పైకి రాగలరు అనేందుకు రోల్ మోడల్ లాంటి వాడు ఆయన..కేవలం ఒక సినీ నటుడుగా మాత్రమే కాదు.. వ్యక్తిగతం గా కూడా ఆయన ఆదర్శప్రాయకులు.. సినిమాలు ఇండస్ట్రీ అన్న తర్వాత ప్రేమని ఎంత అయితే పొందుతారో ద్వేషాన్ని కూడా అదే రేంజ్ లో పొందుతారు.. చిరంజీవి ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

ఆయన మీద అక్కస్సుతో నెగటివ్ కామెంట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఆ నెగటివిటీ ని కూడా ఆయన ఎదుర్కొంటున్నాడు.. ముఖ్యంగా ఆయన తనయుడు రామ్ చరణ్ సక్సెస్ అవ్వడం కూడా ఆయన దురాభిమానులకు మింగుడుపడని విషయం..నెగెటివిటీ చూపిస్తూ ఉంటారు.. సినిమాల పరంగా ఎంత ట్రోల్ల్స్ వేసిన పర్వాలేదు కానీ, వ్యక్తిగతంగా వచ్చే విమర్శలు తీసుకోవడానికి చాలా కష్టం గా ఉంటుంది.. దీనిపై మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ – ఉపాసన తల్లితండ్రులు అవ్వబోతున్నారని చిరంజీవి కొంత కాలం క్రితం అధికారికంగా తెలిపాడు.. దీని గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘నా కోడలు తల్లి అయ్యింది అనే మాట విని చాలా ఎమోషనల్ కి గురి అయ్యాను.. ఈ విషయం నాకు మూడు నెలలు క్రితమే తెలిసింది.. కానీ కడుపులో బిడ్డ పడిన మూడు నెలల తర్వాత ఫ్యాన్స్ కి చెప్తే బాగుంటుందని ఆగాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ చూసాను.. ఉపాసన ని ట్యాగ్ చేసి ఈ విషయం పై చాలా మంది ట్రోల్ల్స్ చేయడం గమనించాను.. చాలా బాధవేసింది.. ప్రతీ ఒకరికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి.. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య పిల్లల్ని కనాలి అనే నిర్ణయం కొంతకాలం వరకు ఆపుకోవాల్సి వస్తుంది.. ప్రతీ మధ్య తరగతి కుటుంబంలో ఉండేదే ఇది.. కానీ మేము సెలబ్రిటీలు అవ్వడం వల్ల నెగెటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తోంది అంటూ చిరంజీవి ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి