Unstoppable2 Chiranjeevi : ఆహా ఓటీటీలో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ ఇంకా పెద్ద హిట్ గా నిలిచింది.. మొదటి మూడు ఎపిసోడ్లు చప్పగా సాగినప్పటికీ ఆ తర్వాత ప్రభాస్ ఎపిసోడ్ తో మళ్ళీ పుంజుకుంది.. ఇటీవలే టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్ కి అభిమానులు.. ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ తర్వాత వెంటనే మరో క్రేజీ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు..అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది..అందరూ వస్తున్నారు కానీ బాలయ్య తో సరిసమానులైన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎందుకు ఈ షోకి రావడం లేదని అభిమానుల్లో ఒక సందేహం ఉండేది..ఆ సందేహాలకు అతి త్వరలోనే తెరపడబోతుందని సమాచారం..
మెగాస్టార్ చిరంజీవి ‘అన్ స్టాపబుల్’ షో లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ సినిమాలపైనే ఉండబోతుందట.. ఈ రెండు సినిమాలు జనవరి 12 మరియు జనవరి 13 వ తారీఖులలో విడుదల కాబోతున్నాయి..రెండు చిత్రాలకు నిర్మాత ఒకరే.. ఈ సందర్భంగా ఇలా చేస్తే రెండు సినిమాలకు ప్రొమోషన్స్ విషయంలో బాగా కలిసొస్తుందని ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.. ఈ ఐడియా మెగాస్టార్ చిరంజీవికి వచ్చినట్టు తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా బయటకి రాబోతున్నట్టు సమాచారం..ముందుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలనుకుంది ఆహా టీం.. కానీ దానికంటే ముందు గా ఇలా ప్లాన్ చేస్తే ఇంకా క్రేజీ గా ఉంటుందని అటు చిరంజీవి , ఇటు బాలయ్య ఇద్దరు అనుకున్నారట..త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని టెలీకాస్ట్ అయ్యేలా చూస్తున్నారు.