Chiranjeevi Pawan : ‘ఖుషి’ మూవీ స్పెషల్ షో థియేటర్ కి విచ్చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి ఇక పండగే

Megastar Chiranjeevi visit ‘Khushi’ movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అవ్వబోతోంది.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి.. అడ్వాన్స్ బుకింగ్స్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి కనీవినీ ఎరుగని రెస్పాన్స్ వచ్చింది.. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఎలా ఉంటుందో అలాంటి యూఫోరియా ఈ సినిమాకి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ […]

Written By: NARESH, Updated On : December 30, 2022 8:04 pm
Follow us on

Megastar Chiranjeevi visit ‘Khushi’ movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అవ్వబోతోంది.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి.. అడ్వాన్స్ బుకింగ్స్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి కనీవినీ ఎరుగని రెస్పాన్స్ వచ్చింది.. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఎలా ఉంటుందో అలాంటి యూఫోరియా ఈ సినిమాకి ఏర్పడింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా వేసుకున్న జల్సా మూవీ స్పెషల్ షోస్ గ్రాస్ రికార్డుని ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాటింది.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ జల్సా మూవీ స్పెషల్ షోస్ రికార్డు ని మాత్రం ఎవ్వరు ముట్టుకోలేకపొయ్యారు.. మళ్ళీ ఆ రికార్డుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రేక్ చెయ్యడం విశేషం..అలా ఆల్ టైం రికార్డు సృష్టించి మంచి జోష్ మీదున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు మరో వార్త ఆ జోష్ ని మూడింతలు రెట్టింపు చేసేలా ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా స్పెషల్ షోకి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల మధ్యలో కూర్చొని చూడబోతున్నారట.. గచ్చిబౌలి ప్రాంతం లోని AMB సినిమాస్ లో చిరంజీవి ఈ చిత్రాన్ని వీక్షించబోతున్నట్టు సమాచారం..మెగాస్టార్ తో పాటుగా వాల్తేరు వీరయ్య మూవీ డైరెక్టర్ బాబీ కూడా రాబోతున్నాడట.. వీళ్ళతో పాటు యంగ్ హీరో నిఖిల్ మరియు నితిన్ వంటి వాళ్ళు కూడా ఖుషి మూవీ స్పెషల్ షోస్ లో సందడి చెయ్యబోతున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ కి ఈ యువ హీరోలు ఎంత పెద్ద ఫ్యాన్స్ అనేది మన అందరికి తెలిసిందే.. ఖుషి సినిమాతో వీళ్లకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.. కేవలం వీళ్ళు మాత్రమే కాదు..టాలీవుడ్ లో ఎంతో మంది సెలెబ్రెటీలకు ఖుషి సినిమా అంటే ఒక ఎమోషన్..వీళ్లంతా టికెట్స్ కోసం ఒకప్పుడు క్యూ లైన్స్ లో నిల్చొని పోలీసుల చేత దెబ్బలు తిన్నవాళ్ళే..అలా ఖుషి చిత్రం రీ రిలీజ్ కేవలం అభిమానుల్లోనే కాదు..సెలబ్రిటీస్ లో కూడా మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసింది.