https://oktelugu.com/

Srikanth – Chiranjeevi : శ్రీకాంత్ పెళ్లి జరగడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఇంత సహాయం చేశాడా!

Srikanth – Chiranjeevi : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్న జంట శ్రీకాంత్ – ఊహా.వీళ్లిద్దరి అనోన్య దాంపత్యం ప్రతీ జంటకి ఎంతో ఆదర్శం, ఈమధ్య ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని ప్రేమ పెళ్లిళ్లు పట్టుమని మూడేళ్లు కూడా నిలబడలేకపోవడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాము.అలాంటిది రెండు దశాబ్దాలకు పైగా ఈ జంట ఇంత ప్రేమగా కలిసిమెలిసి ఉండడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ రెండు దశాబ్దాలలో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 08:56 PM IST
    Follow us on

    Srikanth – Chiranjeevi : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్న జంట శ్రీకాంత్ – ఊహా.వీళ్లిద్దరి అనోన్య దాంపత్యం ప్రతీ జంటకి ఎంతో ఆదర్శం, ఈమధ్య ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని ప్రేమ పెళ్లిళ్లు పట్టుమని మూడేళ్లు కూడా నిలబడలేకపోవడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాము.అలాంటిది రెండు దశాబ్దాలకు పైగా ఈ జంట ఇంత ప్రేమగా కలిసిమెలిసి ఉండడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    ఈ రెండు దశాబ్దాలలో వీళ్ళ మధ్య ఎన్నో గొడవలు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ గొడవలను గడప దాటకుండా పరిష్కరించుకొని ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు,ఈమధ్య విడిపోతున్న జంటలన్నీ కూడా చిన్న చిన్న కారణాలతో విడిపోయిన జంటలే అవ్వడం విశేషం.ఇదంతా పక్కన పెడితే శ్రీకాంత్ – ఊహలది ప్రేమ పెళ్లి అనే విషయం అందరికీ తెలిసిందే,వీళ్లిద్దరు కలిసి అప్పట్లో నాలుగు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

    ప్రేమించుకున్నారు కదా, వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది అని అనుకుంటే పొరపాటే.శ్రీకాంత్ ఇంట్లో వీళ్లిద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఊహ ఇంట్లో మాత్రం ఇవ్వలేదట.పైగా వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసి ఊహకి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారట కుటుంబ సభ్యులు.ఊహ కుటుంబ సబ్యులకు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారికి ఇచ్చి పెళ్లి చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకోలేదట.ఇక శ్రీకాంత్ తన కష్టసుఖాలను ఇండస్ట్రీ లో తన అన్నయ్య గా భావించే మెగాస్టార్ చిరంజీవి తో పంచుకుంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే.

    ఒక రోజు చిరంజీవి వద్ద బాధతో ఈ విషయాన్నీ చెప్పుకున్నాడట శ్రీకాంత్, అప్పుడు చిరంజీవి నేరుగా ఊహ ఇంటికి వెళ్లి ఆమె తల్లితండ్రులతో మాట్లాడి ఒప్పించాడట.చిరంజీవి స్థాయి వ్యక్తి శ్రీకాంత్ కోసం ఇంత దూరం వచ్చాడంటే కచ్చితంగా ఆ అబ్బాయి చాలా మంచి వాడు అయ్యి ఉంటాడని నమ్మి శ్రీకాంత్ కి ఊహ ని ఇచ్చి పెళ్లి చేశారట.అలా ప్రారంభమైన వీళ్లిద్దరి వైవాహిక జీవితం ఎంతో మందికి ఆదర్శ ప్రాయంగా నిలిచింది.