Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ఆమె.. చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీ!

Telugu Indian Idol ఓటీటీలు వచ్చాక వినోదం పాళ్లు కాస్త ఎక్కువయ్యాయి. సినీ ప్రియులకు మరింతగా ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా కూడా సూపర్ హిట్ చిత్రాల నుంచి వెబ్ సిరీస్, టాక్ షోలు, గేమ్ షోలు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఓటీటీ వేదికపై సంగీత సుస్వరాల వేదిక తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది.దాదాపు 15 వారాలు జరిగిన ఈ సంగీత ప్రయాణం ఇప్పుడు ఆఖరి […]

Written By: NARESH, Updated On : June 16, 2022 9:09 pm
Follow us on

Telugu Indian Idol ఓటీటీలు వచ్చాక వినోదం పాళ్లు కాస్త ఎక్కువయ్యాయి. సినీ ప్రియులకు మరింతగా ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా కూడా సూపర్ హిట్ చిత్రాల నుంచి వెబ్ సిరీస్, టాక్ షోలు, గేమ్ షోలు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఓటీటీ వేదికపై సంగీత సుస్వరాల వేదిక తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది.దాదాపు 15 వారాలు జరిగిన ఈ సంగీత ప్రయాణం ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది.

హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో సోమవారం ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు అందరూ ఊహించినట్టుగా బాలకృష్ణ వస్తారనుకున్నా ‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ కు స్వయానా బావ అయిన చిరంజీవియే గెస్ట్ గా రావడం విశేషం.

తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా పాటలు పాడిన వారిందరితో  సరదాగా కలిసిపోయి అలరించారు. కంటెస్టెంట్ ప్రణతి వాళ్ల అమ్మతో కలిసి ‘సందెపొద్దుల కాడ’ అనే పాట పాడుతూ  తనదైన శైలిలో నృత్యం చేశారు.

ఇలా ఒక్కటేమిటీ తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి వేరే లెవల్ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈ ఫైనల్ కు విరాటపర్వం చిత్రంయూనిట్ కూడా హాజరై సందడి చేసింది. రానా, సాయిపల్లవి ఫినాలేలో తమదైన స్టైల్లో చిరంజీవితోపాటు అలరించారు.

తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై విజేతకు ట్రోఫీని అందజేశారు చిరంజీవి.  ఇక ఈ షో విన్నర్ గా నెల్లూరు జిల్లాకు చెందిన వాగ్దేవి నిలిచిందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.

Recommended Videos