
Megastar Chiranjeevi – Pawan Kalyan: వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే.చిరంజీవి నుండి ఈ రేంజ్ కం బ్యాక్ వస్తుందని అభిమానులు కూడా ఊహించలేకపోయారు.అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా ‘భోళా శంకర్’.
తమిళం లో అజిత్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదలమ్’ కి రీమేక్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చెయ్యగా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.విడుదలైన తర్వాత నిజంగా ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉంటే చిరంజీవి ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో.
అసలు విషయానికి వస్తే ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని లాగ కనిపించబోతున్నాడట.అంతే కాదు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ చిత్రమైన ‘ఖుషి’ లోని పాపులర్ నడుము సన్నివేశాన్ని ఈ చిత్రం లో రీ క్రియేట్ చేశారట.చిరంజీవి స్థాయి వ్యక్తి ఇలాంటివి చేస్తే అభిమానులు తట్టుకోగలరా అని సోషల్ మీడియా లో కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీ కి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరంజీవి నటించడం ఏమాత్రం కరెక్ట్ కాదని, దయచేసి చిరంజీవి స్థాయిని తగ్గించే విధమైన సన్నివేశాలను పెట్టొద్దంటూ మెహర్ రమేష్ ని బ్రతిమిలాడుతున్నారు ఫ్యాన్స్.మరో విశేషం ఏమిటంటే చిరంజీవి ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు,అలాంటిది చిరంజీవి ఎలా నటిస్తాడంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.మరి సోషల్ మీడియా లో వచ్చిన ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆగష్టు 11 వరకు వేచి చూడాల్సిందే.
