https://oktelugu.com/

Chiranjeevi Surekha Wedding Photo: చిరంజీవి, సురేఖ‌ల పెండ్లి ఫొటోను చూశారా.. చిరిగిన చొక్కాతోనే తాళి క‌ట్టిన మెగాస్టార్‌..!

Chiranjeevi Surekha Wedding Photo: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరులోనే ఓ బ్రాండ్ ఉంది. క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉంది. ఎంచుకున్న రంగంపై ఇష్టంతో క‌ష్ట‌ప‌డితే ఎంత ఎత్తుకు ఎదుగుతార‌నే దానికి ఆయనో పెద్ద ఉదాహ‌ర‌ణ‌. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయ‌న‌ది చెర‌గ‌ని ముద్ర‌. 1978వ సంవ‌త్స‌రంలో పునాదిరాళ్లు మూవీతో మొద‌లైన ఆయ‌న కెరీర్‌.. అంచెలంచెలుగా ఎదిగి అభిమాన స‌ముద్రాన్ని నిర్మించుకుని మెగాస్టార్ గా ఎదిగేలా చేసింది. కాగా మొద‌టి నుంచే డ్యాన్స్ మీద అమ‌తాస‌క్తి ఉన్న […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 18, 2022 / 11:45 AM IST

    Chiranjeevi Surekha Wedding Photo

    Follow us on

    Chiranjeevi Surekha Wedding Photo: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరులోనే ఓ బ్రాండ్ ఉంది. క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉంది. ఎంచుకున్న రంగంపై ఇష్టంతో క‌ష్ట‌ప‌డితే ఎంత ఎత్తుకు ఎదుగుతార‌నే దానికి ఆయనో పెద్ద ఉదాహ‌ర‌ణ‌. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయ‌న‌ది చెర‌గ‌ని ముద్ర‌. 1978వ సంవ‌త్స‌రంలో పునాదిరాళ్లు మూవీతో మొద‌లైన ఆయ‌న కెరీర్‌.. అంచెలంచెలుగా ఎదిగి అభిమాన స‌ముద్రాన్ని నిర్మించుకుని మెగాస్టార్ గా ఎదిగేలా చేసింది.

    Chiranjeevi Surekha Wedding Photo

    కాగా మొద‌టి నుంచే డ్యాన్స్ మీద అమ‌తాస‌క్తి ఉన్న చిరంజీవి.. నిత్యం కొత్త స్టెప్పులు నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించేవాడు. ఇదే క్ర‌మంలో కొన్ని సినిమాల్లో విల‌న్ గా, అతిథి పాత్ర‌ల్లో, సెకండ్ హీరోగా ఇలా చేస్తూ ఎదుగుతున్నారు. అప్ప‌టికి ఇంకా మెగాస్టార్ గా గుర్తింపు రాలేదు. అయినా స‌రే హార్డ్ వ‌ర్క్ ను వ‌దిలి పెట్ట‌కుండా నిత్యం క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాడు.

    Chiranjeevi Surekha Wedding Photo

    ఇలా కెరీర్ లో మెల్లి మెల్లిగా ఎదుగుతున్న క్ర‌మంలోనే అతని క‌ష్టాన్ని గుర్తించాడు అల్లు రామ‌లింగ‌య్య‌. ఈ క్ర‌మంలోనే త‌న కుమార్తె సురేఖ‌ను ఇచ్చి పెండ్లి చేశాడు. 1980 ఫిబ్రవరి 20న వీరి వివాహం జ‌రిగింది. కాగా పెండ్లి త‌ర్వాతే చిరంజీవి సినిమాల్లో జోరు పెరిగింది. పెళ్ల‌య్యాకే మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. కాగా మ‌రో రెండు రోజుల్లో వీరి వివాహం జ‌రిగి 42 ఏండ్లు పూర్త‌వ‌నున్నాయి.

    Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

    Chiranjeevi Surekha Wedding Photo

    Also Read: హిందీలోకి ఆచార్య.. అధికారిక ప్రకటన రానుంది

    ఈ సంద‌ర్భంగానే సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైర‌ల్ అవుతోంది. చిరంజీవి పెండ్లి నాటి ఫొటో ఇప్పుడు నెట్టింట్లో తెగ సంద‌డి చేస్తోంది. ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే.. పెండ్లి స‌మ‌యానికి చిరంజీవి నూతన్‌ ప్రసాద్‌తో కలిసి తాతయ్య ప్రేమలీలలు మూవీలో చేస్తున్నారు. కాగా షూటింగ్‌లో చిరంజీవి వేసుకున్న అంగి చిరిగిపోయింది.

    కొత్త‌ది కొనుక్కునే స‌రికి లేట్ అవుతుంద‌నే తొంద‌ర‌లో.. అలాగే చిరిగిన బ‌ట్ట‌ల‌తోనే వెళ్లి సురేఖ మెడ‌లో తాళి క‌ట్టారంగ చిరు. ఇదే విష‌యాన్ని ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అంటే ఆయ‌న‌కు సినిమాల ప‌ట్ల ఎంత ఆస‌క్తి ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

    Recommended Video: 

    ఇవి కూడా చదవండి:
    1. ప్చ్.. బాక్సాఫీస్ వద్ద ‘ఖిలాడీ’ పరిస్థితి దారుణం
    2. బాక్సాఫీస్ : యంగ్ హీరోకి సాలిడ్ హిట్ పడినట్టే

    Tags