Chiranjeevi Anasuya : అనసూయతో చిరంజీవి.. ఈ రోమాన్స్ తో దొరికిపోయాడు!

Chiranjeevi Anasuya : వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి.. ఆయనతో నటించాలని చాలా మంది నటీనటులు ఉబలాటపడుతుంటారు. అలాంటి చిరుతో నటించాలని యాంకర్ అనసూయకు ఎప్పటి నుంచో కోరిక. సినిమాల్లో ఇంకా ఆ కోరిక నెరవేరలేదు. గాడ్ ఫాదర్ మూవీలో చిరుతో అనసూయ నటిస్తోందని అంటున్నారు. అయితే తాజాగా ఒక యాడ్ లో మాత్రం అనసూయతో రోమాన్స్ చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది. అది రోమాన్స్ కాకున్నా.. అలా అనుమానించే భార్యకు చివరకు అదిరిపోయేలా షాకిచ్చాడు చిరు. అనసూయ-చిరంజీవి […]

Written By: NARESH, Updated On : April 3, 2022 7:16 pm
Follow us on

Chiranjeevi Anasuya : వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి.. ఆయనతో నటించాలని చాలా మంది నటీనటులు ఉబలాటపడుతుంటారు. అలాంటి చిరుతో నటించాలని యాంకర్ అనసూయకు ఎప్పటి నుంచో కోరిక. సినిమాల్లో ఇంకా ఆ కోరిక నెరవేరలేదు. గాడ్ ఫాదర్ మూవీలో చిరుతో అనసూయ నటిస్తోందని అంటున్నారు. అయితే తాజాగా ఒక యాడ్ లో మాత్రం అనసూయతో రోమాన్స్ చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది. అది రోమాన్స్ కాకున్నా.. అలా అనుమానించే భార్యకు చివరకు అదిరిపోయేలా షాకిచ్చాడు చిరు. అనసూయ-చిరంజీవి మధ్య ఆ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయేలా వర్కవుట్ అయ్యింది.

మన స్టార్ హీరోలు ప్రకటనల్లో నటించడం తెలిసిందే.ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్ కూడా పలు ప్రకటనల్లో నటించి అలరించారు. ఇప్పుడు ఆ వంతు చిరంజీవికి వచ్చింది. తాజాగా చిరంజీవి ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాడు. ఇందులో రియల్ సంస్థ ప్రతినిధి అయిన అనసూయతో కలిసి కాస్త కామెడీ, సస్పెన్స్ పండించాడు.

ఒక సాధారణ ఉద్యోగిగా చిరంజీవి నటించాడు. ఆయన భార్యగా కుష్బు నటించింది. వీరి కల సొంతిళ్లు. అనసూయ రియల్ ఎస్టేట్ ప్రతినిధి. భార్యకు తెలియకుండా సొంతిళ్లు కొన్న చిరంజీవి…. అనసూయ సాయంతో భార్యకు సర్ ప్రైజ్ ఇస్తానని అనుకుంటాడు. అనసూయ కాల్ చేస్తే అది రోమాన్స్ కోసమని.. భర్త తనను మోసం చేస్తున్నాడని కుష్బు అనుమానిస్తుంది. ఆయనకు తెలియకుండా వెంటపడుతుంది. ఇక అనసూయ వద్దకు వచ్చి ఆమెతో రాసుకు పూసుకు తిరిగే చిరంజీవిని చూసి ఖుష్బు సీరియస్ అవుతుంది. కానీ వారిద్దరూ ఒక కొత్త ఇల్లును తనకు గిఫ్ట్ గా ఇచ్చేందుకే ఇలా చేశారని తెలిసి కుష్బు ఎమోషనల్ అవుతుంది.

ఇలా సాధారణ ఉద్యోగి సొంతింటి కల కాన్సెప్ట్ తో సాగిన ఈ యాడ్ లో అనసూయతో రెండు మూడు సీన్లు రోమాంటిక్ గా చిరంజీవి నటిస్తాడు. అనసూయ సైతం తన అందాలను అందమైన చీరలో ఆరబోస్తుంది. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.