https://oktelugu.com/

Youtube vs Media : సెలబ్రెటీలపై రచ్చ: యూట్యూబ్ vs మీడియా చానెల్స్.. ఎవరు కరెక్ట్ ?

Youtube vs Media : చేసే గలీజు అంతా చేసేస్తారు.. చూపిస్తే మాత్రం మండిపడుతారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సాక్షిగా సినీ ప్రముఖులు చేసిన ఏడుపులు, పెడబొబ్బలు, కొట్లాటలు, కొర్కుకోవడాలు.. కెమెరా కంటికి చిక్కి యూట్యూబ్ చానెల్స్ పండుగ చేసుకున్నాయి. ఇందులో మీడియా ఏం తక్కువ తినలేదు. గంటలు గంటలు లైవ్ లు, వీడియోలు, దీనిపై చర్చలు, రచ్చలు, కౌంటర్లతో హోరెత్తించాయి.. సినీ సెలబ్రెటీలు చేసింది తప్పే.. క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ చానెల్స్ పడిన ఆత్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2021 / 04:02 PM IST
    Follow us on

    Youtube vs Media : చేసే గలీజు అంతా చేసేస్తారు.. చూపిస్తే మాత్రం మండిపడుతారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సాక్షిగా సినీ ప్రముఖులు చేసిన ఏడుపులు, పెడబొబ్బలు, కొట్లాటలు, కొర్కుకోవడాలు.. కెమెరా కంటికి చిక్కి యూట్యూబ్ చానెల్స్ పండుగ చేసుకున్నాయి. ఇందులో మీడియా ఏం తక్కువ తినలేదు. గంటలు గంటలు లైవ్ లు, వీడియోలు, దీనిపై చర్చలు, రచ్చలు, కౌంటర్లతో హోరెత్తించాయి.. సినీ సెలబ్రెటీలు చేసింది తప్పే.. క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ చానెల్స్ పడిన ఆత్రం తప్పే.. ఇక ఈ మంటల్లో మీడియా చలికాచుకోవడం అంతకుమించిన పొరపాటే.. అందరిదీ పొరపాటే.. మరి తప్పు మాదంటే మాది కాదని పక్కవారిపై నెపం మోయడం.. దుమ్మెత్తిపోసుకోవడం ఏంటనేది ఇప్పుడు అందరికీ అర్థం కాని ప్రశ్న..

    media vs youtube channels

    యూట్యూబ్ చానెల్స్ అంతకుమించి అతిగా సినీ ప్రముఖుల వ్యక్తిత్వం, పర్సనల్ విషయాలపై గలీజు కథనాలు రాశాయి. అందులో కాదనలేని వాస్తవం ఉంది. అయితే యూట్యూబ్ గలీజే ఒప్పుకుంటాం.. కానీ అంతుమించిన బురదగుంట మీడియా చానెల్స్ ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు.

    నిజానికి ఈ మీడియా చానెల్స్, యూట్యూబ్ సినిమాల ప్రమోషన్ వరకూ వచ్చేసరికి వారి పాపులారిటీ చూసి సినీ ప్రముఖులకు అవసరం పడుతాయి. ఆ తర్వాత తమకు వ్యతిరేకంగా రాస్తే బ్యాన్ చేస్తామంటూ ఇదే సినీ సెలబ్రెటీలు కారాలు మిరియాలు నూరుతారు.

    ఇటీవల మా అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు యూట్యూబ్ చానెల్స్ తీరుపై నోరు పారేసుకున్నారు. వాటిని నిషేధించాలని.. వాటిపై కోర్టుకు ఎక్కుతానన్నాడు. ఇక సమంత అయితే తన విడాకుల విషయంలో అభాసుపాలు చేసినందుకు ఏకంగా యూట్యూబ్ చానెల్స్ పై కోర్టుకు ఎక్కింది. అదే సమయంలో కథనాలు రాసిన పత్రికలు, మీడియా చానెల్స్ తో మాత్రం ఆమె పెట్టుకోలేదు. యూట్యూబ్ చానెల్స్ అతి చేశాయని పరువు నష్టం దావా వేసింది.

    ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబ్ చానెల్ అధినేత బీఎస్ఆర్ బయటకు వచ్చారు. అతి అన్నింట్లోనూ ఉందని.. అందుకూ యూట్యూబ్ చానెల్స్, మీడియా చానెల్స్ అతీతంకాదని.. ఒక్క యూట్యూబ్ లనే టార్గెట్ చేయడం ఏంటని సినీ ప్రముఖులను ప్రశ్నించాడు. చెత్త అనేది అన్నింట్లోనూ ఉంటుందని.. సినిమాల్లోనూ చెత్త ఉంది మేం భరించడం లేదా? అని నిలదీశాడు. యూట్యూబ్ అంటేనే ‘ఛా తూ’ అంటూ ఆవేశపడకండి అని మంచు విష్ణుకు కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే పరస్పర ఆధారిత ఇండస్ట్రీలు మనవని.. మీ వార్తలు మేం రాయాలి.. మీ ప్రమోషన్ మేం చేయాలని.. మీరూ మేము అంతా కలిసి సాగితేనే మనగడ అని బీఎస్ఆర్ చెప్పుకొచ్చారు. మీరు అన్నమయ్య లాంటి సినిమాలనే తీయండని.. అప్పుడు ఎలాంటి కథనాలు ప్రసారం చేయమని.. మీరు చేసే చెత్త అంతా మేం భరించాలా? రాయవద్దా? అని ఆక్షేపించారు.

    ఇక మీడియా చానెల్స్ ను వదిలేసి కేవలం యూట్యూబ్ చానెల్స్ పై పడడం ఎంత వరకూ కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల తెలుగులో నంబర్ 1 చానెల్ తప్పు అంతా యూట్యూబ్ చానెల్స్ దే అని రచ్చ చేసింది.కానీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో, సినిమా రంగంలో సగం వివాదాలను రేపే చానెల్ అదేనని.. ముందుగా దాని నోరు మూయించాలని యూట్యూబర్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా యూట్యూబ్ లకు వ్యతిరేకంగా కథనాలు వేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం ప్రముఖులకు మీడియా కంటి మీద కునుకులేకుండా చేస్తుందన్నది వాస్తవం.. దాన్ని ఎంత వాడాలో అంతే వాడితే అందరికీ మేలు. ఎక్కువగా దుర్వినియోగం అయితే ఇదిగో ఇలానే రోడ్డున పడుతారు. దీనికి యూట్యూబ్ చానెల్స్, మీడియా చానెల్స్, సినీ ప్రముఖులు మినహాయింపు కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.

    -యూట్యూబ్ లను తప్పుపట్టిన సినీ ప్రముఖులపై బీఎస్ఆర్ కౌంటర్ వీడియో