Tarakaratna Helth Condition : అయ్యో తారకరత్న పరిస్థితేంటి ఇలా అయ్యింది!

Tarakaratna Helth Condition : తారకరత్న ఆస్పత్రిపాలై రెండు వారాలు దాటిపోయింది. మూడు నాలుగు రోజులు హడావుడి చేసిన కుటుంబ సభ్యులు, మీడియా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వారం రోజులుగా తారకరత్న ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు. కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ లో అయోమయం నెలకొంది. అమిగోస్ మూవీ విడుదల నేపథ్యంలో కళ్యాణ్ రామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం గురించి మీడియా […]

Written By: NARESH, Updated On : February 9, 2023 6:57 pm
Follow us on

Tarakaratna Helth Condition : తారకరత్న ఆస్పత్రిపాలై రెండు వారాలు దాటిపోయింది. మూడు నాలుగు రోజులు హడావుడి చేసిన కుటుంబ సభ్యులు, మీడియా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వారం రోజులుగా తారకరత్న ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు. కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ లో అయోమయం నెలకొంది. అమిగోస్ మూవీ విడుదల నేపథ్యంలో కళ్యాణ్ రామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం గురించి మీడియా ప్రతినిధులు వాకబు చేశారు. ఆయన అస్పష్టమైన సమాధానం చెప్పారు. డాక్టర్స్ ఏం చెప్పారో నాకు కూడా అదే తెలుసు. అంతకు మించి తారకరత్న హెల్త్ కండిషన్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదన్నారు.

తారకరత్న కోలుకుంటున్నాడు కాబట్టి నందమూరి ఫ్యామిలీ రిలాక్స్ అయ్యారా? లేక ఇంకేమైనా కారణం ఉందా? అనే అనుమానాలు రేగుతున్నాయి. తారకరత్న ఆరోగ్యం వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిందే చివరి అప్డేట్. గుండె,లివర్, కిడ్నీ సాధారణ స్థితికి చేరాయి. రక్తప్రసరణ మెరుగైంది. కొన్ని నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ జరగక పోవడంతో మెదడు పై భాగంలో సమస్య ఏర్పడింది. త్వరలో అది కూడా మెరుగవుతుందని చెప్పారు.

అనంతరం బెటర్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కాగా రోజులు గడుస్తున్నా మరో అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు నందమూరి అభిమానులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీ తారకరత్నను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జనవరి 27న తారకరత్న యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్ తో పాటు కొంచెం దూరం నడిచిన తారకరత్న అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుప్పం స్థానిక ఆసుపత్రికి తరలించగా… ఆయన కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు వెల్లడించారు. అదే రోజు రాత్రి తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.

గుండెతో పాటు ప్రధాన అవయవాలకు సంబంధించిన వైద్య నిపుణులు తారకరత్నను పర్యవేక్షిస్తున్నారు. మొదటి రెండు మూడు రోజులు అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్ విడుదల చేశారు. ప్రజెంట్ కండిషన్ ఏమిటని తెలియాల్సి ఉంది. తారకరత్న అభిమానులు మాత్రం ఆయన కోలుకుంటున్నారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా తారకరత్న ఆరోగ్యం కోసం ఖర్చు చేసినట్లు సమాచారం.