
MBA Chaiwala: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారో సినీకవి. చీకటిని చూసి తిట్టుకునే కంటే ఆ చీకటిలో ఓ చిరుదీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. మోచేతుల్లో బలముంటే మొండి కొడవలైనా తెగుతుంది అంటారు. మనం చేసే వృత్తిని దైవంగా భావించేవారు ఎప్పటికి కూడా రాణిస్తారు. జీవితంలో పైకి ఎదుగుతారు. అనుకున్నది సాధిస్తారు. అంతవరకు విశ్రమించరు. పట్టుదల వదిలిపెట్టరు. ఇలా తాము అనుకున్న లక్ష్యం చేరుకునే క్రమంలో అలుపులేకుండా కష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకుని పైకి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలా మనం చేరుకునే గమ్యం వరకు అకుంఠిత దీక్షతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే.
ఉన్నత చదువులు చదివినా..
అతడు ఉన్నత చదువులు చదివాడు. ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించాడు. ఎంబీఏ చాయ్ వాలా అనే టీ కొట్టు పెట్టుకున్నాడు. దీంతో తన వ్యాపారాన్ని విస్తరించాడు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నచందంగా టీ కొట్టు బ్రహ్మాండంగా నడిచింది. ఫలితంగా కోటీశ్వరుడయ్యాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఆదాయం భారీగా సమకూర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ బెంజ్ కారు కొనుగోలు చేశాడు.
పనినే ప్రేమించాలి
ఇప్పుడు నెట్టింట్లో అతడి గురించి ప్రచారం సాగుతోంది. ఓ చాయ్ వాలా కారు ఓనర్ ఎలా అయ్యాడని అందరు ఆశ్చర్యపోతున్నారు. టీ కొట్టు పెట్టుకుని ఇంత సంపాదించాడా అని నోరెళ్లబెడుతున్నారు. చేసే పనిలో దైవత్వాన్ని చూసుకుంటే ఎందులోనైనా నష్టం రాదు. అది మనం చేసే పనిలో మనం పెట్టే శ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాని నాకు పరిస్థితులు అనుకూలించలేదని చెప్పడం చేతకానితనమే. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. డబ్బు సంపాదించడం పెద్ద విషయమేమీ కాదు.

చాయ అయినా..
చాయ్ వాలా ప్రధానమంత్రి కాలేదా? ఎప్పుడు కూడా మనం చేసే వృత్తిని నామోషీగా ఫీలవకుండా మంచి ఉద్దేశంతో చేస్తే మంచి ఫలితాలు రావడం సహజమే. చాయ్ అమ్మినా అతడో రూ.90 లక్షల బెంజ్ కారు కొనడం అందరిలో సందేహాలకు తావిస్తోంది. టీకొట్టు పెట్టుకున్నా అతడి దృష్టి మారలేదు. సంకల్పం తడబడలేదు. డబ్బు సంపాదించాలనే ఆశతోనే అతడు తన వ్యాపారాన్ని నిరంతరంగా పెంచుకున్నాడు. దీంతో ఆదాయం పెరిగింది. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగడానికి టీ యే కారణమంటే ఎవరు నమ్మరు. కానీ ఇదే నిజం.