2000 Notes Troll: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతుంది. ఇదే సమయంలో ఇందులో క్రియేటివిటీ కూడా రోజురోజుకు హద్దులు దాటిపోతుంది. చిన్న సంఘటన జరిగితే చాలు సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన పోస్టులు, మీమ్స్ తో ట్రోలర్స్ తెగ సందడి చేస్తారు. వీటిని చూసే వాళ్లకు ఆశ్చర్యం కలుగుతుంది. నోటి వెంట నవ్వు యథాలాపంగా వస్తుంది. ఇక వీటి ఆధారంగా సోషల్ మీడియాలో లక్షలకు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక శుక్రవారం 2000 నోటును ఉపసంహరించుకుంటూ భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జోరందుకున్నాయి. 2000 నోటుకు పూలదండ వేస్తూ ఉన్న ఫోటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. #RIP హ్యాష్ ట్యాగ్ తో విపరీతంగా ట్రైను చేస్తున్నారు. 2016 లో పుట్టిన 2000 నోటుకు అప్పుడే కాలం చెల్లిపోయింది అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. కొందరేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మంచిదని వాదిస్తూ ఉంటే.. కొందరేమో నల్లధనాన్ని నియంత్రించలేనప్పుడు ఎందుకు అప్పట్లో పెద్ద నోట్లు రద్దు చేశారని, మళ్ళీ 2000 నోటును తెరపైకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు.
కొందరైతే సినిమాలోని బాగా ప్రజాదరణ పొందిన సీన్లను ఎడిట్ చేసి అందులో 2000 నోటును చెప్పిస్తున్నారు.. సమయం లేదు మిత్రమా 2000 నోటు మార్చుకుందామా అంటూ బాలయ్య డైలాగులను కూడా ట్రెండ్ చేస్తున్నారు.. 2000 నోటు ప్రవేశపెట్టిన కొత్తలో అందులో చిప్ ఏర్పాటు చేశారని ఒక వింత వాదన తెరపైకి వచ్చింది. ఈ 2000 నోట్లు ఒక దగ్గర ఉంటే వాటిని ట్రాక్ చేయవచ్చని అప్పట్లో ప్రచారం జరిగింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. 2000 నోటు ఉపసంహరించిన తర్వాత ఆ చిప్ సంగతి ఏంటని ప్రశ్నిస్తూ మీమర్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
2000 నోటు మార్కెట్లోకి వచ్చిన తొలినాళ్లలో జయలలిత ప్రధాన అనుచరుడు శేఖర్ రెడ్డి వద్ద భారీగా నగదు పట్టుబడింది. అప్పట్లో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు 2000 నోటు ఉపసంహరణ తర్వాత ఇలాంటి వారి పరిస్థితి ఏంటని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుందని ట్రోల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులపాటు 2000 నోటు ఉపసంహరణకు సంబంధించి మీమ్స్ సోషల్ మీడియాను హోరెత్తించడం ఖాయం.
RIP Rs 2000 .#Demonetisation #2000note pic.twitter.com/lKruUXrALP
— Neeraj Kundan (@Neerajkundan) May 19, 2023