Marredpally Atrocious: కంచె చేనును మేసినట్లు.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ ఎస్సై వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త లేని సమయంలో ఆ వివాహిత ఇంట్లోకి వెళ్లడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో రివాల్వర్ గురిపెట్టి మరీ లోబర్చుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన భర్త వెంటనే ఇంటికి చేరుకొని ఆ పోలీసు అధికారిని అడ్డుకున్నాడు. అయినా బాధిత దంపతులిద్దరినీ బెదిరించాడు. అంతేకాకుండా వారిని బంధించి తీసుకెళ్తుండగా తప్పంచుకొని పారిపోయారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సైపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన తాజాగా సంచలనం రేపింది. వ్యవస్థలిపురం ఏసీపీ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.

హైదరాబాద్లోని మారెడ్ పల్లిలో కె. నాగేశ్వర్ రావు ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇతనికి నగరం శివారులో ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. కొన్నేళ్ల కిందట బాధిత మహిళ భర్తను తన వ్యవసాయ క్షేత్రంలో కూలీగా నియమించుకున్నాడు. అయతే అంతకుముందు ఓ కేసులో బాధిత మహిళ భర్తను ఓ కేసులో నాగేశ్వర్ రావు విచారించాడు. అతడు బెయిల్ నుంచి బయటకు వచ్చాక నాగేశ్వర్ రావు తన వ్యవసాయ క్షేత్రంలో పని ఇప్పించాడు. ఈ క్రమంలో నాగేశ్వర్ రావు ఒకరోజు తన ఫాం హౌస్ కు రావాలని కూలీ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఈ విషయం తన భర్తకు చెప్పగా వివాదమైంది. తన భార్యను లైంగికంగా పిలిచిన విషయం మీ భార్యకు చెబుతానని ఆ కూలీ ఏకంగా ఎస్సై నాగేశ్వర్ రావును హెచ్చరించాడు. వద్దని వేడుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
అయితే అప్పటి నుంచి ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న నాగేశ్వర్ రావు కూలీని గంజాయి కేసులో ఇరికించబోయాడు. సికింద్రాబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి రప్పించి అతడి చేతిలో గంజాయి ప్యాకెట్లు ఉంచి ఫొటోలు తీయించాడు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనిమానేశాడు. ఆ తరువాత దంపతులిద్దరూ వ్యవస్థలిపురంలో నివసిస్తున్నారు. వీరి కదలికలను నాగేశ్వర్ రావు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు.

జూలై 6న భర్తలేని సమయం చూసిన నాగేశ్వర్ రావు బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. ముందే వస్తున్నానని మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె భర్త రాకముందే మహిళ ఇంటికి వెళ్లిన నాగేశ్వర్ రావు ఆమెను కొట్టాడు. తన తలపై రివాల్వర్ గురిపెట్టి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో మహిళ భర్త ఇంటికి చేరుకున్నాడు. అక్కడి పరిస్థితిపై ఆగ్రహించిన ఆ కూలీ ఎస్ఐ తలపై కొట్టాడు. తన రివాల్వర్ తో ఇద్దరినీ బెదిరించిన ఎస్సై తన కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యలో కారు టైరు పేలడంతో ప్రమాదం సంభవించింది. దీంతో దంపతులిద్దరూ తప్పించుకు వెళ్లారు. ఆ తరువాత ఇబ్రహింపట్నం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ పై అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read:Virat Kohli Dance: వీడియో: ఇంగ్లండ్ టీ20లో మైదానంలో విరాట్ కోహ్లీ డ్యాన్స్ వైరల్