Early Elections in AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? జగన్ బీజేపీ పెద్దల అనుమతి తీసుకున్నారా? అందుకే ప్లీనరీ వేదికగా జగన్ సంకేతాలిచ్చారా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ నేరుగా ప్రకటించకున్నా కొన్ని రకాల హింట్లు అయితే శ్రేణులకు ఇచ్చారు. మరోవైపు కీలక నేతల వద్ద కూడా ముందస్తు లెక్కలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ తనను నమ్మితేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపునివ్వడం ద్వారా ముందస్తు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ వరకూ ప్రభుత్వానికి గడువు ఉంది. అయితే 2023 సెప్టెంబరులో ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ దూకుడు పెంచారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రజల్లో ఉండాలని కూడా శ్రేణులకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముందస్తుకు వెళ్లకపోతే కొన్నిరకాల సంక్షేమ పథకాలు భారంగా మారతాయని.. ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశముందని భావించి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే పాలనాపరమైన అంశాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు వంటి వాటిపై ప్రభుత్వం ద్రుష్టిసారించింది. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం వంటి వాటిపై కసరత్తు ప్రారంభించింది.

ఆ రాష్ట్రాలతో పాటే..
వచ్చే ఏడాది తెలంగాణతో పాటు కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. పనిలో పనిగా ఏపీ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని జగన్ కేంద్ర పెద్దలను విన్నవించారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయడానికి సహకరించాలని కోరారు. దీనికి కేంద్ర పెద్దలు సైతం అనుమతించారని తెలుస్తోంది. తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఫార్ములా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతున్నారు. లోక్ సభలో తనకున్న సంఖ్యాబలంతో ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన సందర్బాల్లో సహకరిస్తున్నారు. కీలక బిల్లుల ఆమోదం సమయంలో కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే ఎన్డీఏ బలపరచిన అభ్యర్థికి బాహటంగా మద్దతు ప్రకటించారు. ఇవన్నీ భవిష్యత్ లో కేంద్ర పెద్దల సహకారం కోసమేనని తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయితే.. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో పరస్పర సహాయానికి బీజేపీ, వైసీపీల మధ్య ఒప్పందం కుదిరిందన్న టాక్ కూడా నడుస్తోంది. అందుకే రాష్ట్రంలో మిత్రపక్షమైన జనసేనను, కలిసి నడవాలని ప్రయత్నిస్తున్న టీడీపీని దూరంగా పెట్టడానికి కారణాలు ఇవేనంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Also Read: YSRCP Plenary 2022: ప్రజలకు అన్నీ చేశాను.. ఒక మీరే తేల్చుకోండి అంటున్న ఏపీ సీఎం జగన్
అతి ధీమాలో..
ఇప్పటికే వరుస సమీక్షలు, సమావేశాలతో జగన్ బిజీగా ఉన్నారు. ప్లీనరీ వేదికగా కూడా కీలక ప్రసంగం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా తమ వెంటే ఉన్నారని ఆయన ప్రగాడంగా నమ్ముతున్నారు. ఇందుకు మునిసిపల్ ఎన్నికలనే ఉదహరిస్తున్నారు. బాగా కష్టపడితే 175 స్థానాలను సునాయసంగా గెలుపొందగలమన్మ ధీమా వెనుక కూడా సంక్షేమ పథకాలే కారణంగా చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని సైతం గెలుపొంది సత్తా చాటగలమన్న విశ్వాసాన్ని కూడా జగన్ వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రేణులకు ముందస్తు ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగానే చేసినవని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఇప్పటికే ముందస్తుకు సంబంధించి షెడ్యూల్ రూపొందించారని.. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా సీఎం జగన్ చేపడతారని భావిస్తూ వచ్చిన రచ్చబండ కార్యక్రమాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కార్యక్రమం ద్వారా తాను చేసిన అభివ్రుద్ధిని చెప్పి ఓట్లు అడగాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

విపక్షాలకు అవకాశం లేకుండా..
విపక్షాలకు ఎటువంటి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు కార్యక్రమాలకు జనాదరణ పెరుగుతోంది. ఇప్పటికే మహానాడు సక్సెస్ అయ్యింది. టీడీపీ చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి సైతం జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అక్టోబరు నుంచి లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పవన్ యాత్రకు సైతం సన్నాహాలు చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేనలు అలయెన్స్ అవుతాయని భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీలో ఓకింత కలవరం ప్రారంభమైంది. వారికి ఏ మాత్రం అవకాశం కల్పించకూడదని నిర్ణయించుకున్నారు. వారు పొత్తుల చిత్తులకు సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలే శరణ్యంగా భావించి .. జగన్ ముందుకు పావులు కదుపుతున్నారు.
Also Read:Sri Lanka Crisis 2022: సండే స్పెషల్: లంకా దహనానికి ఆ నలుగురే కారణమా?
[…] […]