Aamir Gutub Success Story: చిత్తశుద్ధితో చేసే ప్రతీ పని విజయవంతమవుతుంది. అయితే అది మన ప్రయత్నం బట్టి ఉంటుంది. మన అవసరం, సాధించాలన్న కసి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడం ద్వారా వీలవుతుంది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేలా చేస్తోంది. అమీర్ కుతుబ్ అనే యువకుడి విజయగాథ ఈ అంశాలన్నింటికీ దగ్గరగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదివేందుకు వెళ్లి ఆపసోపాలు పడ్డాడు ఆ యువకుడు. చదువు కోసం విమానాశ్రయంలో క్లీనర్ గా పనిచేశాడు. వార్త పత్రికల ప్యాకింగ్ బాయ్ గా కూడా మారాడు. అహోరాత్రులు శ్రమించి తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోగలిగాడు. ఈ రోజు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే ఒక కంపెనీకి అధినేతగా మారాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డాడు. ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి వైఫల్యాలపై అధ్యయనం చేస్తున్నాడు. వారిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మూడు పదుల వయసులో, అనతికాలంలోనే అద్భుతాలు సాధించాడు. ఆస్ట్రేలియాలోనే భారత నైపుణ్యాన్ని చాటిచెప్పాడు.

పదేళ్ల కిందట..
పదేళ్ల కిందట అమీర్ కుతుబ్ గ్రాడ్యేయేషన్ పూర్తిచేశారు. సహరాన్ పూర్ పట్టణానికి చెందిన కుతుబ్ ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. పరిపూర్ణమైన ఇంగ్లీష్ రాక ఆపసోపాలు పడ్డాడు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూనే చదువుకోవాలని భావించాడు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు 300 ఇంటర్వ్యూలకు హాజరైనా ఉద్యోగం మాత్రం దక్కలేదు. కానీ ఏదో సాధించాలన్న కసి మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. దీంతో చివరికి విమానాశ్రయంలో క్లీనర్ గా విధుల్లో చేరాడు. మరోవైపు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ వార్త పత్రికల ప్యాకింగ్ చేసే పనిలో సైతం కుదిరాడు.
Also Read: Virat Kohli Dance: వీడియో: ఇంగ్లండ్ టీ20లో మైదానంలో విరాట్ కోహ్లీ డ్యాన్స్ వైరల్
టర్నింగ్ పాయింట్
ఈ నేపథ్యంలో ఐసీటీ గీలాంగ్ లో ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం దక్కించుకున్నాడు. అక్కడే తన పనితనాన్ని, సమర్థతను చాటుకున్నాడు. అతడి పనితనాన్ని గుర్తించిన యాజమాన్యం 15 రోజుల్లోనే ఆపరేషన్స్ మేనేజర్ గా పదోన్నతి కల్పించింది.కుతుబ్ పనిపట్ల చూపిన శ్రద్ధ అతడ్ని జనరల్ మేనేజర్ తో కలిసి పనిచేసే వీలు కల్పించింది. తన పనిని, నైపుణ్యాన్ని తెలియజెప్పేందుకు మంచి అవకాశం దక్కింది. జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ కావడంతో రెండేళ్లోనే తాత్కాలిక జనరల్ మేనేజర్ గా మారారు. తన పనితీరుతో కంపెనీ ఆదాయాన్ని 300 శాతానికి పెంచాడు. అయితే మనసులో ఏదో వెలితి. సొంతంగా నిలబడాలన్నది కుతుబ్ ఆశ.

సొంత కంపెనీతో..
కాలక్రమేణా తానే సొంతంగా కంపెనీ పెట్టాలని యోచించాడు. అందుకు తగ్గ ఆర్థిక వనరులు లేవు. కానీ అన్వేషణ ప్రారంభించాడు. ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని రైళ్లు, బస్సుల్లో తన వ్యాపారానికి ప్రోత్సహించే వారు, భాగస్వామ్యమయ్యేవారి గురించి వెతికాడు. చివరకు ఓ చిన్న వ్యాపారి సలహాతో తక్కువ మొత్తంతో కంపెనీ ప్రారంభించాడు. 2000 డాలర్లతో ఎంటర్ ప్రైజెస్ మంకీ కంపెనీని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగాడు. అయితే తొలినాళ్లలో గడ్డు పరిస్థితులు ఎదురైనా నిలబడ్డాడు. క్లయింట్లను కనుగొనడంలో ఇబ్బంది పడ్డాడు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగగా.. వ్యాపారం విస్తరించింది. సరైన గాడిలో పడింది. 2000 డాలర్లతో ప్రారంభించిన వ్యాపారం రెండు మిలియన్ డాలర్లకు విస్తరించింది. ప్రస్తుతానికి అమీర్ కుతుబ్ ఎంటర్ ప్రైజెస్ మంకీ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. క్రుషి ఉంటే ఎంతటి పనైనా సాధ్యమని చేసి చూపించాడు.
Also Read:Ethanol Fuel:5 ఏళ్లలో దేశంలో పెట్రోల్ వాహనాలు ఉండవు.. కేంద్రం మరో సంచలనానికి తెరతీస్తోందా?
[…] […]