https://oktelugu.com/

Manchu Manoj: మనోజ్ రెండవ పెళ్ళిలో మెతుకు కూడా ముట్టని మంచు విష్ణు..తమ్ముడిపై ఇంత కోపం ఎందుకు?

Manchu Manoj: పెళ్ళికి వచ్చినవాళ్లు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత భోజనం చెయ్యకుండా వెళ్ళకూడదు అంటారు పెద్దలు.ఎంత శత్రువు ఇంటి పెళ్ళికి వచ్చినా భోజనం చేసి వెళ్ళలిసిందే.కానీ రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్ రెండవ పెళ్ళికి హాజరైన మంచు విష్ణు మాత్రం ఎదో బయటవాడిలాగా వచ్చి నాలుగు అక్షింతలు వేసి 15 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయాడట.ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ మొత్తం సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది. తమ్ముడి పెళ్ళికి వచ్చి ఇలా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2023 / 11:17 AM IST
    Follow us on

    Manchu Manoj: పెళ్ళికి వచ్చినవాళ్లు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత భోజనం చెయ్యకుండా వెళ్ళకూడదు అంటారు పెద్దలు.ఎంత శత్రువు ఇంటి పెళ్ళికి వచ్చినా భోజనం చేసి వెళ్ళలిసిందే.కానీ రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్ రెండవ పెళ్ళికి హాజరైన మంచు విష్ణు మాత్రం ఎదో బయటవాడిలాగా వచ్చి నాలుగు అక్షింతలు వేసి 15 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయాడట.ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ మొత్తం సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది.

    తమ్ముడి పెళ్ళికి వచ్చి ఇలా చెయ్యడం పై మంచు విష్ణు మీద ట్రోల్ల్స్ సోషల్ మీడియా లో విపరీతంగా వస్తున్నాయి.పెళ్ళైన తర్వాత మంచు లక్ష్మీ మనోజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టింది.కానీ విష్ణు నుండి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా పడలేదు.ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా.మొన్నీమధ్యనే మంచు విష్ణు మా ఎన్నికలలో పోటీ చేస్తే తనవంతుగా ఏవైతే చెయ్యాలో అవన్నీ దగ్గరుండి చేసాడు.

    ఆరోజు పోలింగ్ బూత్ వద్ద మంచు మనోజ్ లెకపొయ్యుంటే రణరంగంగా మారిపొయ్యెది,దగ్గురుంది అన్నీ అలా చూసుకున్నాడు.అలాంటి తమ్ముడి పెళ్ళికి ఎదో వచ్చాము పోయాము అన్నట్టు ఉన్న విష్ణు ధోరణిని తప్పుబడుతున్నారు.గత కొంతకాలం నుండి మోహన్ బాబు ఇద్దరు కొడుకుల మధ్య ఆస్తి పంపకాల విషయం లో గొడవలు జరిగి విడిపోయారని వార్తలు వినిపిస్తూ ఉండేవి.ఇదే విషయాన్నీ మంచు విష్ణు ‘అలీ తో జాలీగా’ ప్రోగ్రాం కి వచ్చినప్పుడు అడగగా ఎదో కహాని చెప్పి కవర్ చేసుకున్న విష్ణు, ఈరోజు తన చేష్టలతో అందరికీ బహిర్గతం అయిపోయాడు.

    ఇంట్లో మనుషుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఇలాంటి శుభకార్యక్రమాలు వచ్చినప్పుడు కలిసుండాలి.కానీ ఇక్కడ మంచు కుటుంబం లో ఆ ఐకమత్యమే చెడిపోయింది.వీళ్ళు అలా ఉండడం వాళ్లకి ఎలా ఉందో తెలియదు కానీ, చూస్తున్న జనాలకు మాత్రం చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది.భవిష్యత్తులో అయినా ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు సర్దుకొని ఎప్పటిలాగా మామూలుగా ఉండాలని కోరుకుందాం.