Manchu Manoj Second Marriage: మంచు మోహన్ బాబు రెండవ కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు..మంచు కుటుంబం నుండి వచ్చిన మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో గా దూసుకొచ్చాడు..సోషల్ మీడియా లో మంచు కుటుంబం మొత్తాన్ని నెటిజెన్స్ ట్రోల్ చేసినప్పటికీ కూడా, మంచు మనోజ్ ని ఎవ్వరు ట్రోల్ చెయ్యరు..ఎందుకంటే ఆయన టాలెంట్ ఉన్న వ్యక్తి, అంతే కాకుండా సమాజం మీద బాధ్యతగల వ్యక్తి.

అతని ప్రసంగాలు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి..అందుకే మంచు కుటుంబం మొత్తం ఒకవైపు..మంచు మనోజ్ ఒక్కడు మరోవైపు అన్నట్టు ఉంటుంది..అయితే చాలా కాలం నుండి ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..అయితే కొన్నేళ్ల క్రితం ఆయన ఒక పాన్ ఇండియన్ సబ్జెక్టు తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు..కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అట్టకెక్కింది..ఆ సినిమాకి బదులుగా మరో ప్రాజెక్ట్ ని సెట్ చేసానని..త్వరలోనే ఆ వివరాలు తెలియచేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
సినీ కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే, మంచు మనోజ్ వ్యక్తిగత జీవితం లో మాత్రం అనేక మలుపులు చోటు చేసుకున్నాయి..2015 వ సంవత్సరం లో ప్రణతీ రెడ్డి ని పెద్దల సమక్షం లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు..కానీ పెళ్ళైన నాలుగేళ్లకే కొన్ని విబేధాల కారణం గా వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది..ఆ తర్వాత ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక తో ప్రేమాయణం నడిపాడు మనోజ్..చాలా సందర్భాలలో వీళ్లిద్దరు కలిసి బయట తిరగడం కూడా మనం చూసాము.

మీడియా కూడా మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అని అడగగా, ఇప్పుడు వాటి గురించి ఎందుకులే, వేరే సందర్భం లో చెప్తాను అని మాట దాటవేసాడు..అయితే ఇప్పుడు ఆయన మౌనిక ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాల్గవ తేదీన పెద్దల సమక్షం లో అంగరంగ వైభవం గా పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యబోతున్నాడు మంచు మనోజ్.