James Cameron: అవతార్ సిరీస్ కోసం జేమ్స్ కెమరూన్ తన జీవితంలోని 20 ఏళ్ళ సమయాన్ని వెచ్చించాడు..బహుశా ప్రపంచం లో రెండు సినిమాల కోసం ఇన్నేళ్ల విలువైన కాలాన్ని త్యాగం చేసిన డైరెక్టర్ లేదు..1997 వ సంవత్సరం లో విడుదలై ప్రభంజనం సృష్టించిన టైటానిక్ చిత్రం తర్వాత దాదాపుగా 12 ఏళ్ళ సమయం తీసుకొని అవతార్ ని తెరకెక్కించాడు..ఈ చిత్రం అప్పట్లోనే మూడు బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ సినిమా తర్వాత హాలీవుడ్ లో ఎన్ని సూపర్ హిట్స్ వచ్చినప్పటికీ అవతార్ కలెక్షన్స్ ని దాటలేకపోయ్యాయి..’ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ కూడా దగ్గరకి వచ్చి ఆగిపోయింది..అలాంటి సంచలనాత్మక సినిమాకి సీక్వెల్ అంటే క్రేజ్ ఉండడం సహజమే..కానీ మనం ఊహించినంత ఓపెనింగ్స్ అయితే ఈ సినిమా మొదటి రోజు రాబట్టలేకపోయింది..కానీ ఫుల్ రన్ లో భారీ వసూళ్లు కచ్చితంగా వస్తాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అవతార్ 2 విడుదలకి ముందు జేమ్స్ కెమరూన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
ముఖ్యంగా సీక్వెల్స్ గురించి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆలోచింపచేసేలా ఉన్నాయి..’అవతార్ 2 కి సీక్వెల్ నేను అప్పటికప్పుడు అనుకొని చేసింది కాదు..చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాను..అందుకోసం చాలా ఆత్మపరిశీలన చేశాను..ఎన్నో విషయాల మీద అధ్యయనం చేశాను..ఆ తర్వాతే సీక్వెల్ తియ్యాలని నిర్ణయం తీసుకున్నాను..1982 వ సంవత్సరం లో స్టీవెన్ స్పిల్ బర్గ్ తెరకెక్కించిన ‘ఎక్స్ ట్రా టెర్రిస్ట్రియాల్’ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది..ఆ కథకి సీక్వెల్ కచ్చితంగా అవసరం ఉంది..కానీ ఎందుకో స్టీవ్ సీక్వెల్ తియ్యకుండానే ఆగిపోయాడు..కానీ నేను అలా ఆగిపోదల్చుకోలేదు’ అంటూ జేమ్స్ కెమరూన్ మాట్లాడాడు.

అంతే కాకుండా ‘అవతార్ 2 ఫ్లాప్ అయితే ఆ ఫ్రాంచైజ్ ని ఇక్కడితోనే ఆపేస్తాను’ అంటూ సంచలన కామెంట్స్ చేసాడు..అవతార్ 2 బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారుగా రెండు బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాలి..వీకెండ్ ముగిసే సమయానికి 1.5 బిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఫుల్ రన్ లో మ్యాజికల్ రన్ ని దక్కించుకొని హాలీవుడ్ లో మొట్టమొదటి 4 బిలియన్ మూవీ అవుతుందా లేదా అనేది చూడాలి.