US Man Wins Lottery: పెళ్లాం చెబితే వినాలని ఈ సంఘటన రుజువు చేసింది. పెళ్లాలు చెప్పిన ఏ ఇంటి పని అయినా చేయడానికి బద్దకిస్తారు. కానీ చేస్తే ఎలా అదృష్టం తలుపుతడుతుందన్నది ఈ సంఘటన రుజువు చేసింది. తాజాగా ఇంట్లో సరుకులు అయిపోయాయని.. వచ్చేటప్పుడు తీసుకురండి అని భార్య ఫోన్ చేసి మరీ చెప్పింది.భార్య మాట విన్న ఆ భర్తకు ఇప్పుడు ఏకంగా లాటరీలో 1.5 కోట్ల జాక్ పాట్ తగిలింది. ఈ సంఘటన అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మిచిగన్ రాష్ట్రంలోని మార్క్వేట్ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్ మాకీ(46) అనే వ్యక్తికి తాజాగా మిచిగన్ లాటరీలో ఏకంగా 1,90,736 డాలర్ల (రూ.1.5 కోట్లు) గెలుచుకున్నాడు. లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజ్ కారణమని ప్రిస్టోన్ చెబుతున్నాడు..
ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్ చేసిందని.. దీంతో వచ్చే దారిలో కొనేందుకు షాప్ కు వెళ్లి.. అక్కడే 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత రోజు ఉదయం లాటరీ టికెట్లను మొబైల్ యాప్ లో స్కాన్ చేయగా ఏకంగా 1.5 కోట్లు గెలుచుకోవడం చూసి షాక్ అయ్యానని.. భార్య కిరాణా సమాను తెమ్మని చెప్పకపోతే ఈరోజు ఇన్ని కోట్ల డబ్బులు గెలుచుకునేవాడిని కాదన్నారు.

లాటరీలో లభించిన ఈ భారీ మొత్తం రూ.1.5 కోట్లను కొంత తన పెట్టుబడుల కోసం ఖర్చు చేస్తానని.. మిగిలినది కుటుంబ సభ్యులకు పంచిపెడుతానని చెప్పాడు. అమెరికాలో ఇటీవల ఓ వ్యక్తి కూడా అచ్చం ఇలానే కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్ కొని లాటరీలో విజేతగా నిలిచాడు