Karnataka: ఫ్రీ జర్నీ హామీ కర్ణాటక ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తోంది. అదే సమయంలో కర్ణాటక ఆర్టీసీకి తీవ్ర నష్టం వస్తోంది. ఇప్పటికే మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. బస్సుల అద్దాలు, డోర్లు పీకిపాడేస్తున్నారు. సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. అయినా హామీ ఇచ్చాం కాబట్టి అమలు చేయాలని అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. అయితే దీనిని అందిపుచ్చుకోవడానికి కొంతమంది పురుషులు కూడా మారు వేషాల్లో ప్రయాణిస్తున్నారు.
రోజుకో వింత..
మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యమా అని కర్ణాటక ఆర్టీసీలో రోజుకో వింత చోటుచేసుకుంటోంది. తాజాగా ధర్వాడ్ జిల్లా కుందగోళ తాలూకా సంశి బస్టాండ్ వద్ద మఠపతి అనే వ్యక్తి ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మారు వేషం వేసుకున్నాడు. బుర్ఖా ధరించి అమ్మాయిల చెప్పులు వేసుకుని బస్టాండ్ వద్ద వేచి ఉన్నాడు. బస్సు రాగానే అందులో ఎక్కాడు.
కండక్టర్‌కు అనుమానం వచ్చి..
కొంత దూరం ప్రయాణించాక కండక్టర్‌కు బుర్ఖా ధరించిన వ్యక్తిపై అనుమానం వచ్చింది. అమె దగ్గరకు వచ్చి ఒకసారి బుర్ఖా తీయాలని కోరింది. దీంతో అతడు కష్టంగా, అనుమాన పడుతూ, భయం భయంగా బుర్ఖా తీశాడు. దీంతో ఆమె కాదు.. అతడు అని తేలింది. ఈ దృశ్యాన్ని బస్సులో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడుది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
గతంలో ఢిల్లీలోనూ..
గతంలో ఢిల్లీలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయితే కర్ణాటక తరహాలో కాకుండా.. అక్కడ సాఫీగా ప్రయాణం సాగుతోంది. జనాభా తక్కువగా ఉండడం, ఎక్కువ మందికి సొంత వాహనాలు ఉండడంతో పోటీ లేదు. అయితే ఇక్కడ కూడా ఓ యువకుడా ఉచిత ప్రయాణం కోసం వేషం మర్చేశాడు. ముఖానికి మాస్క్ ధరించి తలకు స్కార్ఫ్ కట్టుకుని బస్సు ఎక్కాడు. అనుమానం రాకుండా చుడీదార్ డ్రెస్ కూడా వేసుకున్నాడు. కానీ కొంత దూరం ప్రయాణించాక కండక్టర్ గుర్తుపట్టింది. స్కార్ఫ్, మాస్క్ తీయాలని కోరడంతో అసలు విషయం బయటపడింది.
ఉచితంగా ప్రయాణించాలనే..
నాడు ఢిల్లీలో అయినా.. నేడు కర్ణాటకలో అయినా యువకులు వేషం మార్చడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే. ఉచింతగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన కోరికతోనే ఇలా చేశామని చెప్పారు. అయితే కొంతమంది అమ్మాయిలతో కలిసి ప్రయాణం చేయడానికే యువకులు ఇలా చేస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రయాణానికి డబ్బులు లేకుంటే.. మహిళ వేషం కోసం దుస్తులు, చెప్పులు ఎలా కొంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా యువకుల వీడియోలు నట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.