
Mamata Banerjee- Akhilesh Yadav: సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదే ఉండడంతో జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు, మోదీని గద్దె దింపేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. తెలంగాణ మోడల్‌తో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రధాని కావాలని ఆశపడుతున్న మమతాబెనర్జీ కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరంగా ఉంటామని ప్రకటించింది. తాజాగా మమతకు సమాజ్‌వాదీపార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ జత కలిశారు. తాను కూడా కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం ఉంటానని ప్రకటించి దీదీతో చేయి కలిపారు. కొత్త కుంపటి పెట్టే ఆలోచన చేస్తున్నారు. కుదిరితే నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లను చేర్చుకోవడానికి చర్చలు జరుపుతారని అంటున్నారు.

అమ్మో కేసీఆర్..
ఇక ప్రధాని పదవిపై కన్నేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా జాతీయ పార్టీ పెట్టారు. కలిసి వచ్చే పార్టీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాను కూడా కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం అని చెబుతున్నారు. కానీ, అయనతో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదు. దేశంలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న తృణమూల్ అధినేత్రి మమత బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను కనీసం కేర్ చేయడం లేదు. అఖిలేశ్ కూడా మొదట కేసీఆర్‌ను విశ్వసించారు. కానీ ఆయనకు పదవిపైనే వ్యామోహం ఉన్నట్లు గ్రహించారు. దీంతో బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండడమే నయమనుకున్నాడు. దీంతో దీదీతో తేయి కలిపారు.

మొదటి నుంచి దూరం పెడుతున్న మమత..
కారణం ఏమిటో కానీ మమతా బెనర్జీ .. కేసీఆర్ రాజకీయం విషయంలో మొదటి నుంచి విముఖంగా ఉన్నారు. ఓ సారి మమతా బెనర్జీని కోల్‌కతాకు వెళ్లి కలిశారు కానీ.. తర్వాత ఎలాంటి భేటీలు జరగలేదు. జాతీయ రాజకీయాల్లో కలిసి పని చేయాలన్న చర్చలు కూడా జరగలేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు.. ఆయన ఏర్పాటు చేస్తున్న బహింగసభలకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు వస్తున్నారు కానీ.. మమతా బెనర్జీ పార్టీ ప్రతినిధులు కనిపించడం లేదు.
కొత్త కూటమికి అఖిలేశ్ యత్నం..
తాజాగా కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం ఉండే పార్టీలను ఒక్కటి చేసే బాధ్యతను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ తీసుకున్నారు. మమతాబెనర్జీ, కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాలిపోతున్న అఖిలేశ్, కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆ పార్టీలు కూడా అంతే ఉన్నాయి. మరి అఖిలేశ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.