Malla Reddy
Malla Reddy: మల్లారెడ్డి అంటేనే మాస్.. కాదు కాదు ఊరమాస్.. పాల వ్యాపారం మొదులు పెట్టిన మల్లారెడ్డి ప్రస్తుతం కోట్లకు అధిపతి. వ్యాపారంలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. రాజకీయాల్లోకి రాకముందు వరకు మల్లారెడ్డి ఎవరికీ తెలియదు. టీడీపీ నుంచి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిసిన మల్లారెడ్డి.. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఇక మత్రి అయ్యాక ఆయన ప్రత్యర్థులపై చేసే విమర్శలు, సీరియస్ సవాళ్లు.. కాలేజీ ఫంక్షన్లలో చెప్పే డైలాగ్‌లు.. మాస్ డ్యాన్సులు ఇలా అన్నీ మల్లారెడ్డికే చెందుతాయి. ఆయన మాట్లాడినా.. పోట్లాడినా ఏం చెప్పినా ఏం చేసినా అది వైరల్ అవుతోంది. ఒఒక్కసారి సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడే నైజం అతడిది. మంత్రిగా ఉండి కూడా చిందులు వేసిన మల్లారెడ్డి. ఇక మనుమరాలి పెళ్లిలో డ్యాన్స్ చేయకుండా ఉంటారా.. మర్రి రాజశేఖర్‌రెడ్డి కూతురు సంగీత్ ఫంక్షన్‌లో డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు.
బీట్‌కు తగ్గట్లుగా డ్యాన్స్..
సాధారణంగా రాజకీయ నేతలకు డ్యాన్స్ రాదు. డ్యాన్స్ వచ్చినా చేయడానికి ముందుకు రారు. నలుగురులో డ్యాన్స్ చేయడానికి మొహమాటపడతారు. కానీ, తెలంగాణలో మల్లారెడ్డి, ఏపీలో అంబటిలాంటివారు మాత్రం సందర్భానుసారం డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా మల్లారెడ్డి డీజే టిల్లు పాట బీట్‌కు తగినట్లుగా స్టెప్పులే వేశారు. ఇరగదీసిన ఆయన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ కార్యక్రమంలో డాన్సర్లు కూడా పాల్గొన్నారు. 7 పదులు దాటిన వయసులో కూడా మల్లారెడ్డి డాన్సర్లతో పోటీపడి స్టెప్పులు వేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. టిల్లన్న అంటే.. మల్లన్న.. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
28న పెళ్లి…
ఇదిలా ఉంటే తన అల్లుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి కుమార్తె సంగీత్‌లోనే మల్లారెడ్డి ఇంతలా డ్యాన్స్ చేస్తే ఇక ఈనెల 28 జరిగే పెళ్లి బరాత్‌లో ఎంతలా డ్యాన్స్ చేస్తారో అన్న చర్చ జరుగుతోంది. ఆదివారం రాత్రి సంగీత్ జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Mallareddy Mass @chmallareddyMLA @KTRBRS @BRSparty pic.twitter.com/BF9cR53OlY
— Sai (@Vardhavelly) October 21, 2024
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Malla reddy dance video viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com