https://oktelugu.com/

Pushpa 2 – The Rule : అసలు పుష్ప ఎక్కడ.. పులి పక్కన..

Pushpa 2 – The Rule  : పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాం.. కానీ కావాల్సినంత ఫైర్ ఉందని తాజాగా విడుదలైన పుష్ప2లోని ఫస్ట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పుష్ప గ్రాండ్ హిట్ కావడంతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మన అల్లు అర్జున్. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప2’ మూవీపై బోలెడంత అంచనాలున్నాయి. పుష్ప 1లో స్మగ్లర్ గా కనిపించిన పుష్పను అందరూ విలన్ అనుకున్నారు. ఇలాంటి స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2023 / 04:33 PM IST
    Follow us on

    Pushpa 2 – The Rule  : పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాం.. కానీ కావాల్సినంత ఫైర్ ఉందని తాజాగా విడుదలైన పుష్ప2లోని ఫస్ట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పుష్ప గ్రాండ్ హిట్ కావడంతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మన అల్లు అర్జున్. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప2’ మూవీపై బోలెడంత అంచనాలున్నాయి.

    పుష్ప 1లో స్మగ్లర్ గా కనిపించిన పుష్పను అందరూ విలన్ అనుకున్నారు. ఇలాంటి స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపిస్తారు ఏంటి అంటూ గరికపాటి లాంటి వారు విమర్శించారు. కానీ ఆ పుష్ప వచ్చిన కోట్ల డబ్బుతో ఏం చేశాడన్నది రెండో పార్ట్ లో చూపించారు. పోలీస్ కమిషనర్ తో గొడవపడ్డ పుష్ప పార్ట్ 1 ఎండింగ్ ను రెండో పార్ట్ లో అంతకుమించి చూపించాడు సుకుమార్. తాజాగా విడుదలైన టీజర్ అందరి అటెన్షన్ ను ఇటువైపు తిప్పింది. ఫ్యాన్స్ కు బన్నీ బర్త్ డే నాడు అసలైన ట్రీట్ ను ఇచ్చింది. అదిరిపోయేలా సుకుమార్ డిజైన్ చేశాడు.

    పుష్పను పోలీసులు వెంటాడడం.. అడవుల్లో పారిపోవడం.. ఆ తర్వాత అతడి చొక్కాపై 8 బుల్లెట్లతో కనిపించడం.. పుష్ప బాడీ దొరకకపోవడంతో చిత్తూరు జిల్లా మొత్తం అట్టుడికిపోతుంది. జనాలంతా పుష్ప కోసం స్వయంగా ఆందోళనలు చేయడం చూపించారు. నెలరోజుల పాటు అట్టుడికిస్తారు. ఈ క్రమంలోనే పుష్ప చేసిన మంచి పనులన్నింటిని జనాలు గుర్తు చేసుకుంటారు. అతడు చేసిన గుండె ఆపరేషన్లు, పెళ్లిళ్లు సాయాలను మీడియాలో చూపించారు.

    ఇలా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు అని జనం ఫిక్స్ అయిన టైంలో పుష్ప పులుల కోసం పెట్టిన కెమెరాకు చిక్కుతాడు. పులి పక్కనే కనిపిస్తాడు. ఈ సీన్ హైలెట్ అని చెప్పొచ్చు. పుష్పను చూస్తూ పులి వెనుకడుగు వేసి స్టిల్ మెయిన్ హైలెట్ గా నిలిచింది.

    పుష్ప చనిపోలేదు బతికున్నాడని తెలియడంతో జనాలు సంబరాలు చేసుకుంటారు. ఆద్యంతం ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దిన ఈ టీజర్ అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఉర్రూతలూగించేలా సుకుమార్ రూపొందించాడనంలో ఎలాంటి సందేహం లేదు.