
Mahesh- Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ షూట్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టారో అంటే త్వరగా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బిజీ షెడ్యూల్స్ ప్లాన్ చేయగా మహేష్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లే ఆలోచన కూడా మానుకున్నారు. మొదటిసారి మహేష్ లేకుండా నమ్రతా శిరోద్కర్ పిల్లలతో పాటు వెళ్లారు. సమ్మర్ కల్లా దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
అయితే మహేష్-త్రివిక్రమ్ అనుకుంటున్న డేట్ చిరంజీవి లాక్ చేశారు. భోళా శంకర్ విడుదల తేదీగా ఆగస్టు 11 ప్రకటించిన విషయం తెలిసిందే. అదే తేదీన మహేష్ మూవీ విడుదల చేయాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలో ఆగస్టులోనే పోటీగా విడుదల చేస్తారా? లేక మరో తేదీ వెతుక్కుంటారా? అనే సందిగ్ధత నెలకొంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ముందే మహేష్ థియేటర్స్ లో దిగనున్నారు.
ఇక ఉగాది కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీమ్ అలాంటిదేమీ లేదని పండుగకు రెండు రోజులు ముందే హింట్ ఇచ్చారు. రావాల్సిన సమయంలో మహేష్ మూవీ అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దర్శకుడు త్రివిక్రమ్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని, అందుకే ఆలస్యం అంటూ ఓ వాదన వినిపించింది. అలాగే మహేష్ మూవీకి టైటిల్స్ గా పరిశీలనలో ఉన్నాయంటూ కొన్ని తెరపైకి వచ్చాయి. అమ్మ మాట, అడవిలో అర్జునుడు అంటూ రకరకాల పుకార్లు వినిపించాయి .

అవేమీ కాదు… మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ‘అమరావతికి అటు ఇటు’ అనే వినూత్న టైటిల్ ఫిక్స్ చేశారట. వినడానికి కూడా సిల్లీగా ఉన్నా… ఇదే ఫిక్స్ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో అమరావతి హాట్ పొలిటికల్ టాపిక్. ఏపీ రాజధానిగా ఓ పార్టీ కావాలని మరొక పార్టీ వద్దన్న వాదన నడుస్తుంది. అలాంటి ఒక పొలిటికల్ కాంట్రవర్సీని మహేష్ మూవీ టైటిల్ గా త్రివిక్రమ్ ఎంచుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఏదైనా ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే త్వరలో పూర్తి క్లారిటీ రానుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.