
Mahesh-Trivikram Movie: మహేష్ 28వ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. ఈ చిత్రం కోసం భారీ లగ్జరీ హౌస్ సెట్ హైదరాబాద్ లో వేశారు. దాదాపు రూ. 10 కోట్ల ఖర్చుతో ఇంటి సెట్ నిర్మించినట్లు సమాచారం. మహేష్ తో పాటు ప్రధాన తారాగణం పై అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ పై ఒక షాకింగ్ రూమర్ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఓ రీమేక్ అట. ఇక మూవీలో కీలక పాత్రలు ఇవే అంటూ ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ప్రకాష్ రాజ్ హీరో మహేష్ కి తాతయ్యగా కనిపించనున్నారట. గతంలో ప్రకాష్ రాజ్ మహేష్ చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేశారు. అర్జున్, పోకిరి వంటి చిత్రాల్లో విలన్ గా చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో తండ్రి పాత్ర చేశారు. త్రివిక్రమ్ మాత్రం తాతగా చూపిస్తున్నాడట. త్రివిక్రమ్ సినిమాల్లో తాత పాత్రలకు బాగా వెయిట్ ఉంటుంది. అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో త్రివిక్రమ్ తాత పాత్రలకు చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. మరో విశేషం ఏమిటంటే… మహేష్ తో త్రివిక్రమ్ చేసిన గత రెండు చిత్రాలు అతడు, ఖలేజా చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటించారు.
మరో కీలక రోల్ జగపతిబాబు చేస్తున్నారట. ఆయన ప్రధాన విలన్ అని సమాచారం. ఇక ఇది ఈ చిత్ర రీమేక్ అనే సమాచారం లేదు. అదే సమయంలో ఇది ఊహాగానం మాత్రమే. స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. రీమేక్ కాని పక్షంలో ఇది పాత సినిమా అప్డేటెడ్ వర్షన్ కావచ్చు. త్రివిక్రమ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురమో ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు సినిమానే. ఆ సినిమా స్టోరీ లైన్ తీసుకుని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో తీశారు. ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలను మార్చేయడం ఫక్తు ఇంటి గుట్టు సినిమాలో సీన్.

సినిమా సక్సెస్ అయితే ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు. ప్లాప్ అయితే మాత్రం ఏకిపారేస్తారు. అల వైకుంఠపురంలో ఫెయిల్ అయితే త్రివిక్రమ్ విమర్శలపాలయ్యేవారు. ఆ మూవీ ఇండస్ట్రీ కొట్టిన నేపథ్యంలో కాపీ ఆరోపణలు గాల్లో కలిసిపోయాయి. మహేష్ మూవీలో కూడా అలాంటి పాత సినిమా ఛాయలు కొట్టిపారేయలేం. మరి చూడాలి త్రివిక్రమ్ మహేష్ తో ఎలాంటి ప్రయోగం చేస్తారో. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతం.