Rajamouli- Mahesh Babu Movie: దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకధీరుడు రాజమౌళి. తన సినిమాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తనదైన శైలిలో సినిమాలు నిర్మించడం ఆయన నైజం. ఆయన చేతిలో పడిందంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్లడం ఖాయం. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తన సినిమా ఒక్కటి కూడా పరాజయం కాలేదు. రాజమౌళి గొప్ప దర్శకుడు అనడానికి ఇదే తార్కాణం. బాహుబలి సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగారు.

ఇటీవల కాలంలో మన హీరోలు కూడా కొత్త బాట పట్టారు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. గతంలో సినిమాకు ఇంత అని పారితోషికంగా తీసుకునే వారు. ఒక్కో హీరో ఆయన స్థాయిని బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు లాభాల వాటాలతో పారితోషికంతో సంబంధం లేకుండా పోతోంది. అందరు హీరోలు అదే బాటలో నడుస్తున్నారు. లాభాల్లో తమ వాటా తీసుకుంటూ ప్రయోజనం పొందుతున్నారు. దీంతో పారితోషికం కంటే లాభాల్లో వాటాలతోనే ఎక్కువ డబ్బు సమకూరుతున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సినిమాలో అగ్ర నటుడుగా కొనసాగుతున్న మహేశ్ బాబు సినిమాలు సంచలనం సృష్టిస్తుంటాయి. హీరోల్లో అగ్రనటుడిగా మహేశ్ బాబు ఉండగా దర్శకుల్లో రాజమౌళి అగ్రభాగాన నిలుస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆ కల ఎట్టకేలకు నెరవేరే సమయం వచ్చింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా సినిమా ఫైనల్ కాలేదు. మొత్తానికి వీరి కలయికలో సినిమా వస్తుందంటే అందరిలో ఆతృత నెలకొంది.

మహేశ్ బాబు కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. గతంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాకు కూడా లాభాల్లో వాటా తీసుకున్నారు. ఇలా మహేశ్ బాబు పంథా మార్చుకున్నారు. ఇప్పుడు రాజమౌళి సినిమాకు కూడా అదే బాటలో నడవాలని చూస్తున్నారు. కానీ దీనికి తెలుగు నిర్మాతకు అనుబంధంగా హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ను ఇన్ వాల్వ్ చేస్తుండడంతో మహేశ్ కోరిక తీరేలా కనిపిండం లేదు. ఏం జరుగుతుందో చూడాల్సిందే. మహేశ్ బాబు ఎంచుకున్న మార్గంతో మంచి ఫలితాలు వస్తుండటంతోనే ఆయన ఈ మార్గంలో నడుస్తున్నట్లు చెబుతున్నారు.