
Mahesh Babu saved another child : కోట్ల సంపాదన ఉన్నా దాచుకునే జనాలే కానీ సమాజానికి ఒక రూపాయి పంచి పెడదాం అన్న మనసత్త్వం ఉన్నోళ్లు చాలా తక్కువ. అలాంటి వాళ్లకు హీరో మహేష్ అతీతం. తన సంపదలో సమాజ హితం, పసిబిడ్డల ప్రాణం కోసం కొంత దానం చేస్తున్నారు. మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపీ, తెలంగాణాలలో ఉన్న ఈ రెండు గ్రామాలకు అనేక సదుపాయాలు సమకూర్చారు. ఆ గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగించారు. అలాగే చాలా కాలంగా మహేష్ చిన్న పిల్లలకు ఉచిత వైద్యం చేయిస్తున్నారు.
ఎంబీ ఫౌండేషన్ స్థాపించి వందల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు. హృదయ సంబంధిత సమస్యల బారిన పడిన పేద చిన్నారులకు ఆపరేషన్స్ చేయిస్తున్నారు. తాజాగా ఒక్క ఫోన్ కాల్ తో చిన్నారి ప్రాణం నిలబెట్టారు మహేష్. నిర్మాత నాగవంశీకి ఒకరు ఫోన్ చేసి పేద చిన్నారి హృదయ రోగంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ చిన్నారి వివరాలు నిర్మాత నాగవంశీ మహేష్ వైఫ్ నమ్రతకు తెలియజేశారు. ఎంబీ ఫౌండేషన్ తరపున చిన్నారికి రెండు వారాల్లో చికిత్స అందేలా మహేష్ చేశారు. ఆపరేషన్ చేయడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా హీరో గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. గొప్ప విషయం ఏమిటంటే.. ఒక ప్రక్క మహేష్ తండ్రి కృష్ణ ఆసుపత్రిలో విషమ స్థితిలో ఉండగా… విజయవాడలో ఒక బాలుడికి గుండె ఆపరేషన్ జరిగే ఏర్పాట్లు ఫౌండేషన్ తరపున చేశారు. చిన్నారులను కాపాడాలనే మహేష్ నిర్ణయం వెనుక కొడుకు గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఏడు నెలలకే పుట్టాడు. అసలు దక్కుతాడో లేదో అన్న పరిస్థితిలో ఖరీదైన వైద్యంతో గౌతమ్ ని బ్రతికించుకున్నారు.
మనకు డబ్బులున్నాయి కాబట్టి బిడ్డను కాపాడుకున్నాం, మరి పేదల పరిస్థితి ఏంటని మహేష్ కి ఆలోచన వచ్చిందట. అప్పుడు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద చిన్నారులకు సహాయం చేస్తున్నట్లు మహేష్ తెలిపారు. ఈ విషయాలను బాలయ్య అన్ స్టాపబుల్ షోలో మహేష్ బయటపెట్టారు. ఇక మహేష్ త్రివిక్రమ్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతున్నారు. పదికోట్ల రూపాయల ఖర్చుతో భారీ ఇంటి సెట్ వేశారు. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఎస్ఎస్ఎంబి 28గా తెరకెక్కుతుండగా పూజా హెగ్డేగా నటిస్తున్నారు.