https://oktelugu.com/

Mahesh Babu Glamor Secret : అందం కోసం మహేష్ విదేశాల్లో చేస్తున్న పని ఇదా..? గ్లామర్ సీక్రెట్ రివీల్డ్!

Mahesh Babu Glamor Secret : సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఆయన పిల్లలతో పాటు వరల్డ్ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం నమ్రత శిరోద్కర్ ఇద్దరు పిల్లలతో విదేశాలకు వెళ్లారు. ఓ లాంగ్ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ వారితో పాటు వెళ్ళలేదు. ప్రస్తుతం మహేష్ కుటుంబంతో విదేశాల్లో ఉన్నారు. పనిలో పనిగా మహేష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2023 / 04:14 PM IST
    Follow us on

    Mahesh Babu Glamor Secret : సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఆయన పిల్లలతో పాటు వరల్డ్ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం నమ్రత శిరోద్కర్ ఇద్దరు పిల్లలతో విదేశాలకు వెళ్లారు. ఓ లాంగ్ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ వారితో పాటు వెళ్ళలేదు. ప్రస్తుతం మహేష్ కుటుంబంతో విదేశాల్లో ఉన్నారు. పనిలో పనిగా మహేష్ కొందరు వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ ని కలుస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో మహేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

    డాక్టర్ హ్యారీ కోనిగ్ తో ఉన్న మహేష్ ఫోటో వైరల్ అవుతుంది. ఈ డాక్టర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటీ? అని చూడగా… హెల్త్ అండ్ బ్యూటీ ఎక్స్పర్ట్. అలాగే హోలిస్టిక్ నాచురోపత్. మానసిక ప్రశాంతత, మంచి ఆహారం, అలవాట్లు ద్వారా ఆరోగ్యంగా, అందంగా ఎలా ఉండాలో సూచించే నిపుణుడు. డాక్టర్ హ్యారీ జర్మనీ దేశస్థుడని తెలుస్తుంది. దీంతో మహేష్ తన అందాన్ని మరింత పెంచుకోవడానికి, వయసు తగ్గించుకోవడానికి విదేశీ డాక్టర్స్ ని కలుస్తున్నారని స్పష్టత వచ్చింది.

    ఆయన గ్లామర్ సీక్రెట్ ఇదేనా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మహేష్ ని మీ గ్లామర్ రహస్యం ఏమిటని అడగ్గా… బై బర్త్ పేరెంట్స్ ద్వారా వచ్చిన జీన్ తోపాటు మంచి ఆహారం, వ్యాయామం అని చెప్పారు. అలాగే బ్యూటీ ఎక్స్పర్ట్స్ ని కూడా ఆయన కలుస్తారని తాజా ఘటనతో రుజువైంది. మహేష్ ప్రస్తుత వయసు 47 ఏళ్ళు కాగా నమ్మడం కష్టమే. ఆయన వయసు జస్ట్ 25-30 మధ్య ఆగిపోయారు.

    ఈ విషయంలో నమ్రత ఆయనకు పోటీ ఇస్తుంది. నమ్రత వయసు ఏకంగా 51. ఆమె లుక్ మాత్రం జస్ట్ 30 అన్నట్లు ఉంటుంది. అందుకే మోస్ట్ లవ్లీ కపుల్ గా మహేష్-నమ్రత పేరు తెచ్చుకున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 28 వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రాజమౌళితో ప్రకటించిన చిత్రం సెప్టెంబర్ లో స్టార్ట్ కానుందన్న ప్రచారం జరుగుతుంది.