Mahesh and Namrata : గౌతమ్ వల్ల మహేష్,నేను చాలా కష్టాలు పడ్డాము..నమ్రత ఎమోషనల్ కామెంట్స్

Mahesh and Namrata  : ఆరోజుల్లో మహేష్ – నమ్రత వివాహం ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మీడియా కి మరియు ఇండస్ట్రీ పెద్దలకు తెలియకుండా చాలా రహస్యంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది..బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నమ్రత శిరోద్కర్ ని అప్పట్లో మహేష్ బాబు హీరో గా నటించబోతున్న వంశీ చిత్రం కోసం తీసుకున్నాడు ఆ చిత్ర డైరెక్టర్ బి.గోపాల్. అప్పట్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, […]

Written By: NARESH, Updated On : December 18, 2022 11:15 am
Follow us on

Mahesh and Namrata  : ఆరోజుల్లో మహేష్ – నమ్రత వివాహం ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మీడియా కి మరియు ఇండస్ట్రీ పెద్దలకు తెలియకుండా చాలా రహస్యంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది..బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నమ్రత శిరోద్కర్ ని అప్పట్లో మహేష్ బాబు హీరో గా నటించబోతున్న వంశీ చిత్రం కోసం తీసుకున్నాడు ఆ చిత్ర డైరెక్టర్ బి.గోపాల్.

అప్పట్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, ఈ సినిమా తర్వాత నుండే మహేష్ జీవితం లో పెను మార్పులు సంభవించాయి.. నమ్రత తో ప్రేమలో పడడం..ఆ తర్వాత అతనిని పెళ్ళాడి ఈరోజు ఇంత అందమైన జీవితాన్ని గడుపుతున్నారు.. నమ్రత మహేష్ జీవితంలోకి వచ్చాక, కృష్ణ కుటుంబానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి.. మహేష్ బాబు పెద్ద స్టార్ హీరో గా ఎదిగాడు.. హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరికీ అందనంత సూపర్ స్టార్ స్టేటస్ కి చేరుకున్నాడు.

అయితే వీళ్లిద్దరి ప్రేమకి ప్రతిఫలంగా పుట్టిన గౌతమ్ మాత్రం మహేష్ – నమ్రత కి ఎంతో ప్రత్యేకం..గౌతమ్ పుట్టినప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకొని నమ్రత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆమె మాట్లాడుతూ ‘ప్రతీ మనిషి జీవితం లో కష్టాలు ఉంటాయి..సుఖాలు ఉంటాయి..మా ఇద్దరి జీవితంలో కష్టకాలం గౌతమ్ పుట్టినప్పుడే వచ్చింది..గౌతమ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు..కేవలం 1.40 కిలోలు మాత్రమే పుట్టాడు.  ఎంత చిన్నగా అంటే మన అరచేతికి సగం ఉండేవాడు..డాక్టర్లు గౌతమ్ బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు..నేను మహేష్ ఆ వార్త విని చాలా దిగ్బ్రాంతికి లోనయ్యాం.. గౌతమ్ ని బ్రతికించుకోవడానికి చాలా కష్టపడ్డాం..అదే మా జీవితం లో కష్టాలను చూసిన ఫేస్’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.. అప్పటి నుండి మహేష్ బాబు తమకి ఎదురైనా కష్టాలు ఎవ్వరికీ రాకూడదని వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు.. ఇప్పటికి చేయిస్తూనే ఉన్నాడు.