Independence Day 2023: శీర్షిక చూడగానే ఆశ్చర్యపోతున్నారా.. కానీ.. మీరు చదివింది నిజమే. జనగణ మన జాతీయ గీతంగా ఆమోదం పొందే పొందే నాటికి జాతిని ఏకతాటిపైకి తెచ్చి స్వాంతత్య్ర సమరం సాగించిన మహాత్ముడు లేడు. స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూ, సర్దార్ పటేల్, సరోజినీ నాయుడు, సుభాష్ చంద్రబోస్, బీఆర్. అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తోపాటు, ఈ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఇప్పుడు లేరు. కానీ వీరంతా కలిసి జాతీయ గీంత పాడితే.. ఊహికు అందని నేతల జాతీయ గీతాలపానను ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) నిజం చేసింది. భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచాన్నే మాయ చేస్తున్న ఈ కృత్రిమ మేధ సహాయంతో స్వాతంత్య్ర సమరయోధులు జాతీయ గీతాలాపన చేసేలా రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆకట్టుకుంటోంది. నిజంగా ఆ యోధులే వచ్చి జాతీయ గీతలం ఆలపించినట్లు అనిపిస్తోందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
రోమాలు నిక్కబొడిచేలా..
స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించిన మోహన్‌దాస్ కరంచంద్ దాంధీ, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ, సాయుధ పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్, మహిళలను ఏకతాటిపైకి తెచ్చిన సరోజినీ నాయుడు, నిజాం పాలనలో ఉన పలు సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేయించిన సర్దార్ వల్లాభాయ్ పటేల్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, జాతీయ గీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్‌తో ఈ వీడియోలో గీతాలాపన చేయించారు. వీడియో చూస్తే దేశభక్తితో రోమాలు నిక్కబొడుస్తున్నాయి.
సమరయోధులు పత్యక్షమైనట్లు..
స్వాతంత్య్ర సమరయోధులను మనలో మెజారిటీ ప్రజలు చూడలేదు. ఫొటోల్లోనే వారిని చూస్తున్నాం. స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలు, మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భంగా వారిని మనం మననం చేసుకుంటున్నాం. కానీ, ఏఐ సహాయంతో రూపొందించిన ఈ వీడియో చూస్తుంటే.. ఆ మహనీయులే మన కళ్లముందు ప్రత్యక్షమయినట్లు అనిపిస్తుంది. ప్రతీ నేత గొంతు కూడా ఎలా ఉంటుందో అర్థమయ్యేలా వాయిస్‌లోనూ వేరియేషన్ స్పష్టంగా వీడియోలో ఉంది.
ఘనమైన చరిత్ర..
అధినాయక జయహే.. భారత భాగ్య విధాత.. అంటూ యావత్ దేశం లో జాతీయభావాన్ని పురికొల్పే ‘ జన గణ మన ‘ గీతం మన జాతీయ గీతంగా ఏర్పాటు చేసుకుని 73 ఏళ్లు దాటింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారిన ఈగీతాన్ని 1950, జనవరి 24న రాజ్యాంగసభ, జాతీయగీతంగా అధికారికంగా ఆమోదించింది . వాస్తవానికి ఈ గీతాన్ని గురుదేవుడు 1911 డిసెంబర్ 27నే రాశారు. 1919 ఫిబ్రవరిలో ఈ గీతాన్ని స్వరపరిచారు. అందుకు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి వేదిక కావటం మరో విశేషం. ప్రస్తుతం మనం అదే స్వరంలో ఇప్పటికీ పాడుకుంటున్నాము. ఈ గీతాలాపనకు సాధారణంగా 55 సెకెండ్లు పడుతుంది. సంక్లిష్టమైన బెంగాలీ సంస్కృతములో రాసిన ఈ గీతాన్ని రవీంద్రుడు అనంతరం ఇంగ్లీష లోనికి అనువదించారు . బహుళ భాషలు, యాసలు సమ్మిళితమైన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ గీతాన్ని ఆలపించినా.. ఆయా ప్రాంతాలను బట్టిపదాలలో మార్పులు కనిపిస్తుంటాయి. అసలు గీతంలో కొన్ని నిశ్శబ్దాక్షరాలూ కనిపిస్తుంటాయి .