Maharastra : అది మహారాష్ట్రలోని బుల్దానా సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మార్గమది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాత్రి 2 గంటల సమయంలో ఓ బస్సు వెళుతోంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఒక కుదుపు. బస్సు ఒక్కసారిగా బోల్తాపడగా.. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలిసేలోగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఏకంగా ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్నారు.
యావత్మాల్ నుంచి పుణేకు 32 మంది ప్రయాణికులతో బస్సు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సు టైరు పేలిపోయింది. డివైడర్ ఎక్కి బోల్తా పడింది. ఆ సమయంలో ఎగసిపడిన నిప్పులు ఆయిల్ ట్యాంకర్ కు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటపడే మార్గం లేకపోయింది. 25 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. అక్కడి మృతదేహాలు పడి ఉన్నతీరు భయంగొల్పుతున్నాయి. కాగా ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడడం విశేషం.
ఏడుగురు ప్రయాణికులు తీవ్రగాయాలతో బయటపడ్డారు. వారిని బుల్దానా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి వైద్యసేవలందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు బుల్దాన ఎస్పీ తెలిపారు. ప్రధాని నరంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర కుటుంబం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Maharashtra buldana samridhi mahamarg expressway bus caught in fire 25 people charred to death
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com