Nine Married Woman in Mahabubabad: హిందూ వివాహ వ్యవస్థపై పాశ్చాత్యులకు భలే ఇష్టం ఉంటుంది. వారు మన ఆచార వ్యవహారాలను ఎంతో ప్రేమిస్తారు. మన పెళ్లిళ్లను చూసి ముచ్చట పడుతుంటారు. మన వివాహ తీరుకు ముగ్దులవుతుంటారు. జీవితంలో ఒకరినే వివాహం చేసుకోవడం అనేది వారికి ఇష్టమైన పాయింట్. దీంతో మన వివాహాన్ని చూసి వారు కూడా ఇదే కోవలో చేసుకుంటే బాగుంటుందని భావిస్తుంటారు. ఇంతటి విలువ కలిగిన ఆచార వ్యవహారాలను కొందరు అపహాస్యం చేస్తున్నారు. తమ స్వార్థానికి మన వ్యవస్థలకు ముప్పు తెస్తున్నారు.

తాజాగా మహబూబాబాద్ కు చెందిన ఓ యువతి ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలస్తోంది. హైదరాబాద్ లో తన తల్లితో కలిసి ఉంటోంది. ఆమెను వివాహం చేసుకున్న భర్త ఆమె తీరుపై ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. ఆమె ఫోన్ లో మాట్లాడుతుండగా అనుమానం వచ్చిన భర్త ఆమెను వెంబడించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆమె ఇదివరకే కొందరిని పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అందుకు సంబంధించిన వివరాలు కూడా సంపాదించాడు.
దీంతో అతడు ఆమె తీరుపై విమర్శలు చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. సదరు యువతి ఇలా చేస్తుందని అనుకోలేదని వాపోతున్నాడు. బెంగుళూరులో ఉద్యోగం చేసే అతడు మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమెపై నాంపల్లి, మహబూబాబాద్ కోర్టుల్లో పలు కేసులు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాలు సేకరించాడు. ఆమె పెళ్లిళ్ల విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

ఇలాంటి యువతితో తాను సంసారం చేయలేనని చెబుతున్నాడు. తనకు విడాకులు కావాలని ఆశిస్తున్నాడు. తనను మోసం చేసి దొంగ పెళ్లి చేసుకున్న యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్న స్వప్నను చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాడు. హిందూ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన ఆమెను చట్టం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. తనకు న్యాయం చేసి ఆమెతో విడాకులు ఇప్పించాలని కోరడం కొసమెరుపు.
Also Read:Ek Nath Shinde Uddhav Thackeray : ఠాక్రేపై తిరగబడ్డ షిండే కథ