
Laya Daughter: సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగాలంటే గ్లామర్ ను షో చేయాలని కొందరు భావిస్తారు. కానీ ఆకట్టుకునే ఫేస్ తో పాటు మంచి వాక్చాతుర్యం ఉన్నా నటిగా రాణిస్తారని లయ నిరూపించింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన లయ మిగతా హీరోయిన్ల లాగా అందాలు ఆరబోసి రచరచ్చ చేయలేదు. సింప్లిసిటీ మెయింటేన్ చేస్తూ అచ్చ తెలుగు అమ్మాయిలా తన నటనతో ఆకట్టుకుంది. అలా నటించడంతోనే ఆమెకు విపరీతమైన అభిమానులు పెరిగారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమెను ఫాలో అవుతున్నారు. పెళ్లయిన తరువాత లయ సినిమాలు మానేసింది. కానీ ఇప్పుడు ఆమె కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. లయతో సమానంగా హీరోయిన్ రేంజ్ లో ఉన్న ‘శ్లోకా’ గురించి ఆసక్తి విషయాలు మీకోసం.
‘భద్రం కొడుకో..’ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో అడుగుపెట్టింది లయ. ఆ తరువాత ‘స్వయం వరం’ అనే సినిమాలో హీరోయిన్ గా మొదటిసారి నటించింది. డైలాగ్స్, కామెడీ, లవ్ యాక్షన్ కలిగిన ఈ సినిమా సక్సెస్ కావడంతో లయకు అవకాశాలు తలుపు తట్టాయి. ఆ తరువాత ఆమె నటించిన ‘ప్రేమించు’ సినిమాలో అంధురాలిగా నటించి నంది అవార్డు సొంతం చేసుకుంది. స్టార్ హీరో బాలకృష్ణ తో పాటు పలు చిత్రాల్లో నటించిన ఆమె పదేళ్లపాటు సినీ ఇండస్ట్రీలో తిరుగులేకండా కొనసాగింది.

కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే లయ అమెరికాకు చెందిన గణేష్ గోగుర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయన అమెరికాలో ఫేమస్ డాక్టర్. దీంతో సినిమాలు మానేసిన ఆమె అక్కడ కొన్ని రోజుల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తరువాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరిలో ఒకరు ‘శ్లోక’ కాగా.. మరో కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన తరువాత తన భర్త సినిమాల్లో కొనసాగడానికి అవకాశం ఇచ్చినా.. పిల్లలతోనే జీవితాన్ని గడిపింది. అయితే ఇన్నేళ్ల తరువాత ఆమెకు మళ్లీ సినిమాల వైపు మనసు మళ్లింది.
అయితే ఆమె నటించడానికి కాదు. తన కుమార్తె శ్లోక ను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టించడానికి రెడీ అవుతోంది. తన కుమార్తె శ్లోక ఇప్పటికే రవితేజ హీరోగా వచ్చిన ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రి ఇచ్చింది. ఇప్పుడు శ్లోక హీరోయిన్ రేంజ్ లోఅందంగా తయారైంది. దీంతో ఆమెను హీరోయిన్ గా సినిమాల్లో పరిచయం చేయడానికి లయ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? చూడాలి.