
Ammoru Movie Child Artist: కోడిరామకృష్ణ మదిలో నుంచి వచ్చిన ‘అమ్మోరు’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవత సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించి ఆ కాలంలోనే కోడి రామకృష్ణ సంచలనం సృష్టించారు. ఈ సినిమా తరువాతే చాలా మంది డైరెక్టర్లు గ్రాఫిక్స్ ను వాడడం మొదలుపెట్టారు. సురేస్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన ఇందులో ఓ చిన్నారి నటనకు అంతా షాక్ తిన్నారు. దేవత చిన్నమ్మాయి రూపంలో వచ్చినట్లుగా చిన్నారిలా ఎవరూ నటించలేదని అన్నారు. అయితే ఆమె పెరిగి పెద్దయి ఇప్పుడు ఎంతో అందంగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఓ సినిమాలో సైడ్ రోల్ లో నటించింది. మరి ఆ ముద్దుగుమ్మ ఇప్పుడెలా ఉందో చూద్దామా.
అమ్మోరు సినిమాలో చిన్న దేవత పాత్ర పోషించిన అమ్మాయి పేరు సునయన. ఈమె బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. ఆ తరువాత స్టడీస్ పై ఫోకస్ పెట్టడంతో సినిమాల నుంచి దూరమైంది. అయితే చాన్నాళ్ల సునయన మళ్లీ తెలుగు తెరపైనే కనిపించింది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చని ‘ఓ బేబీ ’ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా సునయను చూడొచ్చు. ఈ సినిమా యావరేజ్ హిట్టు కొట్టడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. అయితే ఆ తరువాత ఈమె మరో తెలుగు, తమిళం సినిమాలో కనిపించింది.
ప్రస్తుతం సినిమాల నుంచి తప్పుకున్న ఆమె వ్యాపారంతో బిజీగా మారింది. సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని చెబుతున్న ఆమె ఓ వ్యక్తిని వివాహం చేసుకొని హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఊరికే కూర్చోవడం ఇష్టంలేదని తెలుపుతున్న ఆమె ‘ఫ్రేస్టేటెడ్ ఉమెన్’ పేరుతో ఓ య్యూటూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. పలు వీడియోలు అప్లోడ్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అమ్మోరు సినిమాతో పాపులర్ అయిన సునయన పెరిగి పెద్దయ్యక స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అయితే ఆమె అందమైన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో అలరిస్తన్నాయి. చిన్నారిగా ఉన్న సునయను, ఇప్పటి సునయను చూస్తూ యూత్ పలు కామెంట్లు పెడుతున్నారు. కొందరు మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు.