live in relationship : పెళ్లికి ముందే హద్దు దాటడం మన సంస్కృతి కాదు.. అలా దాటితే బరితెగించిన ఆడదని తిట్టిపోస్తారు.. మగాడిని బజారు మనిషిగా చూస్తారు. కానీ విదేశాల్లో ఇది కామన్. దీనికి ‘సహజీవనం’ అని పేరు చెప్పి విచ్చలవిడిగా చేసుకొని పిల్లలను కని నచ్చితేనే పెళ్లి చేసుకుంటారు. నచ్చకుంటే విడిపోతారు. ఈ సంప్రదాయ విదేశాల్లో ఉంది. భారత్ లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నా మెజార్టీ ప్రజలు మాత్రం ఈ సంస్కృతికి దూరంగానే ఉంటున్నారు.
కానీ భారత్ లోని ఓ తెగ మాత్రం ఇప్పటికీ దీన్ని పాటిస్తోంది. స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయవచ్చు. పిల్లలను కనవచ్చు. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు. నచ్చకపోతే విడిపోవచ్చు. అచ్చం విదేశాల్లోని ఈ సంస్కృతిని భారత్ లోని ఓ తెగ పాటిస్తుందంటే నమ్మగలరా? కానీ నిజంగా ఇది నిజం..
గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే కొన్ని తెగల్లో ఈ ‘సహజీవన’ సంప్రదాయం కొన్ని శతాబ్ధాలుగా కొనసాగుతోంది. యుక్త వయసులోకి రాగానే అక్కడి అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవడానికి వీలుగా రెండు రోజుల జాతర నిర్వహిస్తారు. అందులో నచ్చిన మగాడిని ఎంచుకొని పెళ్లితో సంబంధం లేకుండా అతడితో కాపురం చేయవచ్చు.
ఈ క్రమంలోనే అబ్బాయి కుటుంబం ఇందుకుగాను కన్యాశుల్యంగా అమ్మాయి కుటుంబానికి కొంత మొత్తం చెల్లించాలి. అప్పుడే వీరి సహజీవనం మొదలవుతుంది. భవిష్యత్తులో వీరు పిల్లలను కని పెళ్లికి రెడీ అయినా పెళ్లి ఖర్చు అంతా అబ్బాయే భరించాలిక్కడ. వరుడి ఇంట్లోనే పెళ్లితంతు జరుగుతుంది.
ఇష్టపడిన అబ్బాయితో ఎంజాయ్ చేసే ఆచారం ఈ తెగలో శతాబ్దాలుగా ఉంది. పిల్లలను కూడా కనొచ్చు. ఏలోటు లేకుండా కుటుంబాన్ని పోషిస్తాడు ఆ మగాడు అనుకుంటేనే ఆ మగవులు పెళ్లికి సిద్ధపడుతారు. లేదంటే దూరం జరగుతారు.. ఇక్కడ పెళ్లి అన్నది నామమాత్రపు తంతుగా ఉంది.
గరాసియా తెగలో ఈ ఆచారం శతాబ్ధాలుగా ఉంది. వాటిని ఇప్పటికీ ఈ తరం కొనసాగిస్తోంది. మగాళ్లు లొల్లి చేసినా.. గొడవలు పడ్డా ఆడవాళ్లే విడిపోతారు. ఆ స్వేచ్ఛ వారికి ఉంది. వీటివల్లే వరకట్న వేధింపులు, అమ్మాయిలపై అత్యాచారాలు, మరణాలు పోతాయని అక్కడి వారు చెబుతున్నారు.