
Liton Das IPL2023: ఐపీఎల్ ఆటగాడు అంటే ఎలా ఉండాలి? వికెట్ కీపింగ్ చేస్తుంటే ఇంకెలాంటి జాగురూకతతో ఉండాలి? కోట్లు తీసుకుంటూ గల్లి కీపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అచ్చం లిటన్ దాస్ లా ఉంటుంది. ఔను ఈ మాట అంటున్నది మేము కాదు..నెటిజన్లు.. క్రీజు వదిలి బ్యాట్స్మెన్ అల్లంత దూరం వెళ్లిపోయినప్పటికీ.. బంతి చేతిలో ఉన్న వికెట్లను గిరాటేయలేందంటే లిటన్ దాస్ కీపింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ ఇలాంటి కీపర్ ను ఎలా ఎంచుకుంది అని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు బ్యాట్స్మెన్ ను ఔట్ చేయకుండా లిటన్ దాస్ నిర్లక్ష్యం వహించాడు.. కోల్కతా ఓటమికి కారణమయ్యాడు.
ఢిల్లీలో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కతా తరపున జాసన్ రాయ్(39 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 43) మాత్రమే రాణించాడు. చివరిలో అండ్రీ రసెల్ (31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్ లతో 38) మెరుపులు మెరిపించాడు.. ఢిల్లీ బౌలర్లలో ఈశాంత్ శర్మ (2/19), అన్రిచ్ నోర్జ్ (2/15), అక్షర్ పటేల్ (2/13), కుల దీప్ యాదవ్ (2/15) వికెట్లు తీయగా, ముఖేశ్ కుమార్ (1/34) ఒక వికెట్ తీశాడు.. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 128 పరుగులు చేసి విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 11 ఫార్లతో 57) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మనీష్ పాండే(21), అక్షర్ పటేల్(19) విలువైన పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, నితీష్ రాణా రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది అనేకంటే కోల్కతా చేజేతులా ఓడిపోయింది అనడం సబబు. ఎందుకంటే బౌలింగ్ కు అనుకూలించిన ఈ మైదానంపై కోల్కతా బౌలర్లు పదునైన బంతులు వేశారు. వాటిని తప్పుగా అంచనా వేసిన ఢిల్లీ బ్యాటర్లు క్రీజు వదిలి ముందుకు వచ్చారు. అయితే ఇలాంటి సమయంలో వారిని అవుట్ చేయడంలో కోల్కతా కీపర్ లిటన్ దాస్ ఎక్కడా లేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. ఇలా అతడు 3 వికెట్లు వదిలేశాడు.. ఫలితంగా కోల్కతా మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది..మ్యాచ్ అనంతరం కోల్కతా కెప్టెన్ మాట్లాడుతూ.. “ఈ మ్యాచ్ మేం గెలవాల్సి ఉండేది. కానీ లిటన్ దాస్ స్క్రిప్ట్ వేరే విధంగా ఉంది. దానికి మేము ఏమి చేయలేమని” వ్యాఖ్యానించాడంటే దాస్ ఆట తీరు వల్ల జట్టు సభ్యులు ఎంత నిరాశలో మునిగిపోయారో అర్థం చేసుకోవచ్చు.. అన్నట్టు వరుస ఐదు ఓటముల తర్వాత ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచింది. లిటన్ దాస్ కీపింగ్ చెత్త కీపింగ్ ను నెటిజన్లు తూర్పార పడుతున్నారు. ” ఇలాంటి గల్లీ కీపింగ్ చేసేందుకేనా నిన్ను కోట్లు పెట్టి కొన్నది, దయచేసి మా అందమైన దేశాన్ని విడిచి వెళ్లిపో” అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హిట్ బ్యాటర్ అయిన లిటన్ దాస్..ఈ మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేయడం విశేషం.
Nitish Rana said, “We’re trying our best to win and DC trying their best to lose this game as per the Script, but bkl Litton Das wasn’t aware about the script maybe”#DCvKKR pic.twitter.com/2utT5vqLnL
— S. (@Sobuujj) April 20, 2023