Khushi Re Release: మాస్ మరియు కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయం లో ఒక స్వచ్ఛమైన అర్బన్ లవ్ స్టోరీ నేపథ్యం లో 2001 వ సంవత్సరం లో విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం..ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘నరసింహ నాయుడు’ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఫ్యాక్షన్ నేపథ్యం లో వచ్చిన ఆ సినిమా రికార్డ్స్ ని కేవలం మూడు నెలలు కూడా గడవకముందే ఖుషి చిత్రం బద్దలు కొట్టి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..చాలా ప్రాంతాలలో ఈ సినిమాకి పడిన హౌస్ ఫుల్స్ కౌంట్ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా పడలేదు..అలాంటి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఈ చిత్రానికి ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతం లో 204 షోస్ కి బుకింగ్స్ ఓపెన్ చేసారు..ఈ షోస్ అన్నిటికి కలిపి ఇప్పటి వరకు 81.5 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి..RTC క్రాస్ రోడ్స్ లో దేవి థియేటర్ నుండే దాదాపుగా 9 లక్షల 50 రూపాయిలు వచ్చాయి..చాలా మంది హీరోలకు కొత్త సినిమాకి కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం జరుగలేదు..మొత్తం మీద హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం కలిపి ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది ఒక చరిత్ర..భవిష్యత్తులో కూడా ఏ రీ రిలీజ్ సినిమా ఈ రికార్డు ని బద్దలు కొట్టలేదు..అలా ఆల్ ఇండియా మొత్తం కలిపి ఈ సినిమాకి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..అంటే జల్సా స్పెషల్ షోస్ రికార్డు ని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే క్రాస్ చేసేసింది అన్నమాట.