Waltair Veerayya Collections: ఈ సంక్రాంతికి పోటీ పడిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం భారీ మార్జిన్ కలెక్షన్స్ తో విజేతగా నిల్చిన సంగతి తెలిసిందే..మెగాస్టార్ మాస్ పవర్ కి రికార్డ్స్ మొత్తం చెల్లాచెదురైపోయాయి..వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి మెగా ఫ్యాన్స్ లో ఒక రేంజ్ జోష్ ని నింపాడు మెగాస్టార్..రీ ఎంట్రీ తర్వాత ఆయనకీ ఇది మూడవ వంద కోట్ల సినిమా.

‘ఖైదీ నెంబర్ 150’ మరియు ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాయి..ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి..దాంతో డీలాపడిన మెగా ఫ్యాన్స్ కి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరోసారి వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు మెగాస్టార్.
కేవలం పండుగ సెలవుల్లో మాత్రమే కాదు..వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తుంది..శనివారం రోజు ఈ సినిమాకి వచ్చిన గ్రాస్ మరియు షేర్ వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు సైతం మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యింది..ప్రపంచవ్యామాప్తంగా సుమారు 15 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 7 కోట్ల రూపాయిల షేర్ ని ఈ సినిమా సాధించింది..ఇదివరకు #RRR చిత్రం మినహా ఒక్క సినిమా కూడా ఈమధ్య కాలం లో రెండవ శనివారం ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేదు..ఒక్క మెగాస్టార్ కి మాత్రమే ఆ రేర్ ఫీట్ సాధ్యమైంది.

మార్నింగ్ షోస్ నుండే డీసెంట్ స్థాయి వసూళ్లను శనివారం రోజు నమోదు చేసుకున్న ఈ చిత్రం, మ్యాట్నీస్ నుండి మళ్ళీ ర్యాంపేజ్ మోడ్ ని ప్రారంభించింది..ముఖ్యంగా నైజాం , ఉత్తరాంధ్ర మరియు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయి హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం..శనివారం రోజే ఇలా ఉందంటే, ఇక ఆదివారం రోజు ఏరేంజ్ లో ఉంటుందో అని ట్రేడ్ పండితులు లెక్కలు వేసుకుంటున్నారు.